టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న రకుల్ తనకు ఎఫైర్ వుందంటూ, బోయ్ ఫ్రెండ్ ఇల్లు కొనిచ్చాడంటూ తెగ రూమర్స్ ఇల్లు కూడా ఎవడో కొనిచ్చాడంటే ఎలా అని రకుల్ ఆగ్రహం 

తెలుగు ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. చిన్న సినిమాలతో మొదలైన ఆమె సిని ప్రస్థానం స్టార్స్ తో చేసే రేంజ్ కు వెళ్లింది. కెరియర్ లో మంచి జోష్ కనబరుస్తున్న రకుల్ కు ఈమధ్య స్ప్రెడ్ అయిన ఓ రూమర్ తనని చాలా బాధపెట్టిందని వెళ్లడించింది. ఓ స్టార్ హీరో తనకు ఇళ్లు కొనిచ్చాడన్న న్యూస్ ఆమ్మడిని చాలా బాధపెట్టిందట.

హీరో హీరోయిన్ అన్నాక రూమర్లు రావడం సహజం. అయితే అఫైర్ ఉందని న్యూస్ రాయడం కామనే కాని ఏకంగా రకుల్ కు ఆ హీరో ఇళ్లే కొనిచ్చాడు అన్న వార్తలు రావడం ఆమెను చాలా డిస్ట్రబ్ చేశాయట. ముఖ్యంగా తన ఫ్యామిలీ ఈ వార్తలపై బాధాపడ్డారని అన్నది రకుల్. ఓ ఇళ్లు కొనిచ్చే బోయ్ ఫ్రెండ్ ఉన్నాడనడం తనకు గర్వకారణమే అని కాకపోతే అలాంటి ఫ్రెండ్ ఉన్నా తాను మాత్రం ఫ్రీగా తీసుకోనని అంటుంది. 

3 కోట్లతో తనకు ఇళ్లు కొనిచ్చాడని వచ్చిన ఆ వార్తలు తనపై చాలా ప్రభావితం చేశాయని.. తాను కష్టపడి ఇళ్లు కొంటే హీరో కొనిచ్చాడని వార్తలు రావడం షాకింగ్ గా అనిపించాయని అన్నది. ఏది ఏమైనా రకుల్ ఇంత వివరణ ఇచ్చింది కాబట్టి సదరు ఇళ్లు సొంత డబ్బుతోనే కొనేసిందని నమ్మేయొచ్చు. ఒక్కో సినిమాకు కోటికి పైగా వసూలు చేసే ఆమె ఇంకొకరిని అడగాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. ప్రస్తుతం ఈ శుక్రవారం జయ జానకి నాయకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రకుల్ స్పైడర్ లో మహేష్ పక్కన నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు బాలీవుడ్ లోనూ అవకాశాలతో అయ్యారీ అంటూ రకుల్ దూసుకెెళ్తోంది.