చలపతిరావు వ్యాఖ్యలపై భగ్గుమన్న మహిళా లోకం చలపతిరావును శిక్షించాల్సిందేనని డిమాండ్, కేసులు చలపతిరావు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన రకుల్ ప్రీత్ సింగ్

రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు చేససిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి. అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారంటూ వందలాది మంది హాజరైన ఆడియో వేడుకలో ఎంతో మంది మహిళల సమక్షంలో.. మైక్ లో బహిరంగంగా.. చలపతిరావు చేసిన వ్యాఖ్యలు మహిళా లోకం ఆగ్రహాన్ని చవి చూస్తున్నాయి. ఈ ఆగ్రహంలో ప్రతి ఒక్క మహిళ పాలుపంచుకుంటుండటం గమననార్హం. ఇక రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంలో హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆ ఆడియో ఫంక్షన్లో ఉంది. నాగచైతన్య పక్కనే కూర్చుని ఉన్న రకుల్ చలపతిరావు వ్యాఖ్యలకు ఖంగు తింది.

ఇప్పటికే చలపతి రావు కామెంట్లపై మహిళా సంఘాలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి. ఇప్పటికే అతడిపై పీఎస్‌లో కేసు కూడా పెట్టారు. చలపతిరావు కామెంట్లపై ఇప్పటికే అక్కినేని నాగార్జున స్పందించి క్లారిటీ ఇచ్చారు. అలాంటి రాక్షస బల్లి జాతి ఇంకా ఉండటం కరెక్ట్ కాదంటూ నాగార్జున ట్వీట్ కూడా చేశారు. తాజాగా చలపతిరావు వ్యాఖ్యలపై రారండోయ్ వేడుక చూద్దాం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది.


చలపతిరావు కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ఆడియో వేడుకలోనే ఉన్నా... చలపతి రావు వ్యాఖ్యలపై లేటుగా స్పందిస్తున్నానని, అసలు చలపతిరావు అన్న మాటలకు అర్థమేంటో తనకు తెలియదని, అతడన్న మాటలకు అర్థమేంటో తెలిశాక కోపమొచ్చిందని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఆ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్టు చెప్పింది. ట్విట్టర్లో స్పందించిన రకుల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

చలపతిరావు తన వయసుకు తగినట్టు ప్రవర్తిస్తే బాగుంటుందని, ఇలాంటి మాటల వల్ల అతడిపై తన చుట్టూ ఉండే వారికి ఏహ్య భావం కలుగుతుందని చెప్పింది. అంతపెద్ద పొజిషన్లో ఉన్నవాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల.. ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త వాళ్లపైనా చెడు ప్రభావం పడుతుందని పేర్కొంది. కెరీర్ ఆరంభంలో చాలా సందర్భాల్లో చాలా మంది ఇలాంటి వ్యాఖ్యలు చేసినా.. చాలా సార్లు మిన్నకుండిపోయానని, కానీ, ఇప్పుడు జరిగిన సంఘటనతో మాత్రం నోరు మెదపకుండా ఉండలేకపోతున్నానని చెప్పుకొచ్చింది. సీనియర్లు కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుందని ఆమె హితవు పలికింది.

ఇక చలపతిరావు కామెంట్ చేసినప్పుడు నాగచైతన్య, రకుల్ నవ్వుతున్న సందర్భంపైనా ఆమె వివరణ ఇచ్చింది. చలపతి రావు ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు తాము నవ్వామంటూ దాదాపు 5 నిముషాల పాటు తమ వీడియోనే కొన్ని ఛానెళ్లు ప్రసారం చేశారని, కానీ, తాము నవ్వింది అతడి కామెంట్లు విని కాదని వివరించింది రకుల్.

Scroll to load tweet…
Scroll to load tweet…