పవన్ కళ్యాణ్ ను ఇరుకున పెడుతున్న రకుల్ ప్రీత్

పవన్ కళ్యాణ్ ను ఇరుకున పెడుతున్న రకుల్ ప్రీత్

ఖాకీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తోంది రకుల్. ఖాకీ రిలీజ్ సందర్భంగా.. అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగు వెర్షన్ కూ రకుల్ తెగ ప్రమోషన్స్ చేస్తోంది.

 

ఇక పవన్ కళ్యాణ్ సరసన నటించాలని ఉందని గతంలో పలుసార్లు తన మనసులోని మాటను వెలిబుచ్చిన రకుల్ కోరిక నెరవేరుతుందనే అంతా అనుకున్నా అసలు ఆ వైపుగా ఏలాంటి న్యూస్ వినిపించటం లేదు. కనీస క్లారిటీ కూడా లేదు. రకుల్ కూడా ఇక ఆ ఆఫర్ మీద ఆశలు వదిలేసుకున్నట్టే ఉంది.

 

అయితే ఈ మధ్యనే పవన్ కళ్యాణ్‌తో సినిమా ఎప్పుడు అనే ప్రశ్న ఎదురైంది. త్వరలోనే అనో.. నేనూ ఎదురుచూస్తున్నా అనో ఆన్సర్ రావాలి కానీ రకుల్ మాత్రం డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చింది. అడిగిన వాళ్ళకే భాధ్యత అప్పజెప్పేసింది.

 

ఓ పని చేయండి "నాకూ చేయాలనే ఉంది. ఓ పని చేయండి. మీరే వెళ్లి ఇదే ప్రశ్న పవన్ కళ్యాణ్ గారినే అడగండి"అనేసింది రకుల్ ప్రీత్ సింగ్. పవన్ నే ఆన్సర్ అఢగమని చెప్పడం చూస్తే రకుల్ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదనిపిస్తుంది.

 

ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ తర్వాత రెండు సినిమాల్ని చేయాల్సి ఉంది. వాటిలో ఒకటి ఆర్టీ నీసన్ తో కాగా మరొకటి సంతోష్ శ్రీనివాస్ ప్రాజెక్ట్. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన సంతోష్ శ్రీనివాస్ పవన్ సరసన హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నారట. సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ ను ప్రాజెక్టులోకి తీసుకునే యోచనలో ఉన్నారని టాక్ వచ్చింది. మరి చూడాలి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos