Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఫిబ్రవరి 28వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం. 

ఈరోజు ఎపిసోడ్ లో లాస్య తులసిని ఒప్పించడానికి పొగుడుతూ కాక పడుతూ ఉంటుంది. అనుకుంటే జరగనిది ఏదీ లేదు తులసి నందుకి కేఫ్ పెట్టించి నందు లైఫ్ ని సెటిల్ చేశావు అలాగే దివ్యతో కూడా మాట్లాడి చూడు తప్పకుండా ఒప్పుకుంటుంది అని అంటుంది లాస్య. ఏమంటావ్ నందు అనడంతో అవును అందరూ సెటిల్ అయ్యారు అంతా నీ ప్లానింగ్ వల్లే అనడంతో థాంక్యూ అని అంటుంది తులసి. మిగిలిన ఒక బాధ్యత కూడా తీసేస్తే మన బాధ్యతలు ఇది పోతాయి అంటాడు నందు. పిల్లల మనసు మల్లెతీగ లాంటివి స్మూత్ గాడు టీలు చేయాలి అని అంటాడు నందు. దివ్య ఏమనిందో విన్నారు కదా అని అంటుంది తులసి. దివ్య ఏదో తెలిసి తెలియక మాట్లాడుతోంది.

నచ్చ చెబితే ఒప్పుకుంటుంది అనడంతో చెప్పి చూడండి నాకేం అభ్యంతరం లేదు అని అంటుంది తులసి. నేను చెప్పగలిగితే మా వల్ల అయ్యే పని అయితే ఇంత ఆలోచించాల్సిన అవసరం ఏముంది దివ్య మాట్లాడితే ఒప్పుకోదు నువ్వు చెబితే ఒప్పుకుంటుంది అని అంటాడు నందు. దివ్య నచ్చి వాళ్లే ఏకంగా స్వయంగా వచ్చి అడిగారు. ఎంతో మర్యాదపూర్వకంగా మాట్లాడారు అని నందు అనగా తులసి ఆలోచనలో పడుతుంది. బిజినెస్ ఫ్యామిలీ వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ కూడా బాగా ఉంది అని అంటుంది లాస్య. బిజినెస్ కూడా బాగుంటుంది అనడంతో అప్పుడు తులసి మన బిజినెస్ కోసం వాళ్లతో వియ్యం అందుకోమంటున్నారు అంతేనా అని అంటుంది. బిజినెస్ విషయం కోసం దివ్య లైఫ్ ని నాశనం చేయమంటారా అని అంటుంది తులసి.

కాదు తులసి అంటూ లాస్య నచ్చజెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పెళ్లిచూపుల్లా కాకుండా మాములుగా వచ్చి వెళ్తామా అని చెప్పారు కదా తులసి ఆ విషయం గురించి ఒకసారి ఆలోచించు అనడంతో తులసి ఆలోచనలో పడుతుంది. అప్పుడు నందు లాస్య లు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో తులసి ఆలోచనలో పడుతుంది. ఒకవైపు విక్రమ్ కి పనిమనిషి వచ్చి నాన్నగారు అసలు భోజనం చేయడం లేదు టాబ్లెట్స్ కూడా వేసుకోవడం లేదు అనడంతో విక్రమ్ భోజనం తీసుకొని తన తండ్రి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు విక్రమ్ నీ కన్నీళ్లను కూడా నువ్వు తుడుచుకోలేని పరిస్థితిని కొని తెచ్చుకున్నావు అని అంటాడు. ప్రేమగా చూసుకునే అమ్మను అవమానించావు ఆవేశపడ్డావు.

ఇప్పుడు చూసావా ఎలా జరిగిందో అని అంటాడు విక్రమ్. అప్పుడు విక్రమ్ వాళ్ళ నాన్న గతంలో జరిగిన విషయాలు తలచుకొని నష్టం ఎవరికో కాదు నాన్న నీకే అదే విషయాన్ని గట్టిగా అరిచి చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నాను అని ఏడుస్తూ ఉంటాడు. నాకు దేవత లాంటి అమ్మను ఇచ్చావు అనడంతో అది దేవత కాదురా రాక్షసి అనుకుంటూ ఉంటాడు విక్రమ్ వాళ్ళ నాన్న. ఎందుకు తిండి తినడం మానేసావ్ చెప్పు అనడంతో కళ్ళ ముందు జరిగే ఘోరం చూడలేక తిండి మానేశాను అనుకుంటూ ఉంటాడు. మందులు వేసుకోవడం కూడా మానేశావు నాకు ఇది నచ్చడం లేదు నాన్న అని ఎమోషనల్ అవుతాడు విక్రమ్.

నేను మహారాజుల బతుకుతుంటే నువ్వు మాత్రం ఏంటి నాన్న ఇలా ఇదంతా అనడంతో నువ్వు మహారాజుల బతుకుతున్నావని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు ఒక అనాధవి రా ఆ విషయం నీకు ఎలా చెప్పాలి అనే మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉంటాడు విక్రమ్ వాళ్ళ నాన్న. నాకోసం తిను నాన్న నువ్వు సంతోషంగా ఉంటేనే కదా లేకపోతే నేను ఎలా ఉండాలి అని విక్రమ్ ఏడుస్తూ తన తండ్రికి తినిపిస్తూ ఉంటారు. చిన్నప్పుడు విక్రమ్ ఒక చోట కూర్చొని బాధపడుతూ తల్లి కావాలి అంటుండగా ఇంతలో అక్కడికి విక్రమ్ వాళ్ళ నాన్న వచ్చి మీ అమ్మ వస్తుంది అంటే నేను విషం తాగడానికైనా సిద్ధమే అనడంతో అప్పుడు విక్రమ్ వాళ్ళ నాన్న తెచ్చిన పాలు తాగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

అప్పుడు మళ్లీ పెళ్లి చేసుకో అని విక్రమ్ వాళ్ళ నాన్నకు వాళ్ళ తాతయ్య సలహా ఇస్తాడు. వద్దు నాన్న అనడంతో ఏమి కాదు నీ కొడుకు విక్రం కోసమైనా పెళ్లి చేసుకో అని చెబుతాడు. ఆ తర్వాత విక్రమ్ ఒకచోట కూర్చుని బాధపడుతూ ఉండగా అప్పుడు వాళ్ళ నాన్న రాజ్యలక్ష్మి పెళ్లి చేసుకుని వస్తాడు. అప్పుడు రాజ్యలక్ష్మి ని చూసి దూరంగా పారిపోతాడు విక్రం. అప్పుడు మీరేం దిగులు పడకండి వాడిని నేను నెమ్మదిగా అలవాటు చేసుకుంటాను అంటుంది రాజ్యలక్ష్మి. తర్వాత విక్రమ్ ఒకచోట కూర్చుని వాళ్ళ అమ్మ ఫోటో చూస్తూ బాధపడుతూ ఉండగా అప్పుడు రాజ్యలక్ష్మి అక్కడికి వెళ్లి బాబు మీ అమ్మని నన్ను ఇక్కడికి పంపించింది నువ్వు బాధపడకు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది.

ఆ తర్వాత విక్రమ్ కళ్ళు తిరిగి పడిపోవడంతో అమ్మవారి దగ్గరికి వెళ్లి నా కొడుకుని బతికించు తల్లి అని ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. అప్పుడు విక్రమ్ కళ్ళు తెరవడంతో రాజ్యలక్ష్మి సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు విక్రమ్ రాజ్యలక్ష్మి కి చేతులు జోడించి మీరు ఇకపై నాకు పిన్ని కాదు మా అమ్మ అనడంతో సంతోషంగా హత్తుకుంటుంది. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే రాజ్యలక్ష్మి కి ఒక కొడుకు పుడతాడు. ఆ తర్వాత రాజ్యలక్ష్మి విక్రమ్ రెడీ చేసి ముస్తాబవుతూ ఉండగా అప్పుడు రాజ్యలక్ష్మి వాళ్ళ అన్నయ్య ఆమె మనసును చెడగొట్టి విక్రమ్ మీద ద్వేషం పెంచుకునేలా చేస్తాడు. అప్పటివరకు బాగానే ఉన్న రాజ్యలక్ష్మి ఒకసారిగా విక్రం మీద ద్వేషం పెంచుకుంటుంది వాళ్ళ అన్న చెప్పుడు మాటలు విని తప్పుగా ఆలోచిస్తూ ఉంటుంది.

అప్పుడు విక్రమ్ చదువుకుంటుండగా కావాలని కొత్త డ్రామా మొదలుపెట్టి నాకు ఒక రోగం ఉంది నాన్న ఎప్పుడూ నన్ను ఒకరు కని పెట్టుకుంటూ ఉండాలి అని అనడంతో ఇకపై నుంచి చదువు మానేస్తాను అని విక్రమ్ పుస్తకాలు విసిరి కొట్టేస్తాడు. ఎవరు చెప్పినా నేను వినను ఇకపై చదువుకోను అని అంటాడు విక్రమ్. తర్వాత విక్రమ్ వాళ్ళ నాన్నను మారిపోయావు రాజ్యలక్ష్మి నీలో తల్లి ప్రేమ చచ్చిపోయింది మీ తమ్ముడు చెప్పిన మాటలు విని నువ్వు చెడిపోయావు అని అంటుండగా రాజ్యలక్ష్మి మాత్రం అతని మాటలను లెక్కచేయకుండాఅవును అని అంటుంది.