40 రోజులకు 65 కోట్ల పారితోషికం !

rajinikanth to be paid rs 65 crore for his next movie
Highlights

ఈ ఒక్క సినిమా కోసమే రజనీ 40 రోజుల కాల్‌షీట్లు కేటాయించారట.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఏ స్థాయిలో రికార్డులు సృష్టిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రజనీకాంత్ హీరోగా నటించిన ‘కాలా’ సినిమా విడుదలకు సన్నద్ధం అవుతోంది. అలాగే శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘2.0’ కూడా త్వరలోనే విడుదల కానుంది. ఈ రెండు సినిమాల సంగతలా ఉంటే, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రజనీకాంత్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ మొదలుకానుంది. విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. రజనీ కెరీర్‌లో ఇది 165వ చిత్రం. అయితే ఈ సినిమాకు రజనీ రూ.65 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ ఒక్క సినిమా కోసమే రజనీ 40 రోజుల కాల్‌షీట్లు కేటాయించారట. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మరోపక్క శంకర్‌ దర్శకత్వం వహించిన ‘రాబో 2.ఓ’ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

 

 

loader