Asianet News TeluguAsianet News Telugu

Kamal haasan: కమల్ కి రజినీ ఫోన్...!

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కరోనా బారినపడడం చిత్ర పరిశ్రమతో పాటు ఆయన ఫ్యాన్స్ ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న కమల్ హాసన్ త్వరగా కోలుకుని తిరిగి రావాలని అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. ఇక కమల్ చిరకాల మిత్రుడు రజినీకాంత్ స్వయంగా కమల్ హాసన్ తో మాట్లాడారు. 
 

rajinikanth spoken over phone with kamal haasan inquires about his health condition
Author
Hyderabad, First Published Nov 25, 2021, 9:04 AM IST

ఇటీవల అమెరికా వెళ్లారు కమల్ హాసన్ (Kamal haasan) . ఓ బిజినెస్ ట్రిప్ లో భాగంగా ఆయన యూఎస్ కి వెళ్లడం జరిగింది. యూఎస్ నుండి తిరిగి వచ్చిన కమల్ హాసన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దగ్గు రావడంతో వైద్య పరీక్షల చేయించారు.  పరీక్షల అనంతరం కమల్ హాసన్ కి కోవిడ్ సోకినట్లు డాక్టర్స్ ధృవీకరించారు. వెంటనే ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో అడ్మిట్ కావడంతో పాటు ఐసోలేట్ కావడం జరిగింది. డాక్టర్స్ బృందం కమల్ హాసన్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

 
కమల్ కోవిడ్ బారినపడ్డారని తెలుసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)ఆయనకు ఫోన్ చేశారు. కమల్ తో మాట్లాడిన రజినీ... ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, త్వరగా కోలుకుని తిరిగి వస్తానని కమల్ తెలియజేసినట్లు సమాచారం. పరిశ్రమలో చిరకాల మిత్రులుగా ఉన్న కమల్ హాసన్, రజినీకాంత్ మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. దర్శక దిగ్గజం కె బాలచందర్ వీరిద్దరి గురువు. 

Alo read Bigg boss season 5: బిగ్ బాస్ హోస్ట్ గా శృతి హాసన్!
మరోవైపు కమల్ కి కోవిడ్ సోకడంతో తమిళ్ బిగ్ బాస్ 5 (Bigg boss season 5) హోస్ట్ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు అనే సమస్య తెరపైకి వచ్చింది. గత ఐదు సీజన్స్ గా కమల్ సక్సెస్ ఫుల్ హోస్ట్ గా కొనసాగుతున్నారు. ఇక ఆయన స్థానాన్ని కూతురు శృతి హాసన్ భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేదు. మరో రెండు రోజుల్లో వీకెండ్ ఉండగా... దీనిపై స్పష్టత రానుంది. ప్రస్తుతం కమల్ హాసన్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విక్రమ్ మూవీ చేస్తున్నారు.  మాఫియా నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా విక్రమ్ తెరకెక్కుతుంది. 

Also read ఆసుపత్రిలో చేరిన కమల్ హాసన్.. కరోనా పాజిటివ్, ఆందోళనలో అభిమానులు
 

Follow Us:
Download App:
  • android
  • ios