Asianet News TeluguAsianet News Telugu

Bigg boss season 5: బిగ్ బాస్ హోస్ట్ గా శృతి హాసన్!

బిగ్ బాస్ తమిళ్ హోస్టుగా ప్రారంభం నుండి కొనసాగుతున్నారు లోకనాయకుడు కమల్ హాసన్. లేటెస్ట్ బిగ్ బాస్ సీజన్ 5 ఆయన సారథ్యంలో ఇటీవలే ప్రారంభం అయ్యింది. అయితే అనూహ్యంగా కమల్ హాసన్ కరోనా బారిన పడగా.. హోస్ట్ ఎవరనే సందేహాలు తెరపైకి వచ్చాయి.

bigg boss season 5 shruti hasan turns host replaces kamal haasan
Author
Hyderabad, First Published Nov 23, 2021, 1:17 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బిగ్ బాస్ హోస్ట్ గా కమల్ హాసన్ సూపర్ సక్సెస్. గత ఐదు సీజన్స్ గా కమల్ తిరుగులేని టీఆర్పీ తో తమిళ్ బిగ్ బాస్ షోని నడిపిస్తున్నారు. ఆయన సారథ్యంలో ఇటీవలే సీజన్ 5 (Bigg boss season5) గ్రాండ్ గా ప్రారంభమైంది. అనూహ్యంగా కమల్ కరోనా బారిన పడడంతో చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఐసొలేషన్ వార్డ్ లో కోవిడ్ కి చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హోస్ట్ గా ఆయన బాధ్యతలు ఎవరు తీసుకుంటారు అనే సందేహం అందరిలో మొదలైంది. కమల్ హాసన్ కోలుకోవడానికి రెండు మూడు వారాల సమయం పట్టే అవకాశం కలదు. కోవిడ్ నెగిటివ్ రిజల్ట్ వచ్చిన వెంటనే షూట్ లో పాల్గొనడానికి ఉండదు. కాబట్టి ఈ సీజన్ కి కమల్ హోస్ట్ గా చేయడం ఇకపై కష్టమే అంటున్నారు. 


కాగా కమల్ కి ప్రత్యమ్నాయంగా హీరోయిన్ శృతి హాసన్ (Shruti haasan) పేరు తెరపైకి వచ్చింది. కమల్ కి తగ్గ వారసురాలు అనిపించుకున్న ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ, కమల్ బాధ్యతలు సమర్ధవంతంగా నెరవేర్చగలదన్న ఆశాభావం జనాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తానేమిటో నిరూపించుకున్న శృతి హాసన్ బిగ్ బాస్ హోస్ట్ గా కరెక్ట్ అన్న మాట వినిపిస్తోంది. మరి శృతితో ఈ విషయమై బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదింపులు జరిపారా లేదా? అసలు విషయం ఎక్కడ వరకు వచ్చింది,అనేది స్పష్టత లేదు. అయితే బిగ్ బాస్ హోస్ట్ గా శృతి హాసన్ అంటూ న్యూస్ మాత్రం చక్కర్లు కొడుతుంది.

Also read ఆసుపత్రిలో చేరిన కమల్ హాసన్.. కరోనా పాజిటివ్, ఆందోళనలో అభిమానులు

 ఓ బిజినెస్ ట్రిప్ కోసం కమల్ హాసన్ అమెరికా వెళ్లడం జరిగింది. ఈ ట్రిప్ లో ఆయనకు కోవిడ్ సోకింది. దగ్గు ప్రారంభం కావడంతో అనుమానం వచ్చి వైద్యులను సంప్రదించగా, కోవిడ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని కమల్ హాసన్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. కోవిడ్ ఇంకా తగ్గుముఖం పట్టలేదని, అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రస్తుతం కమల్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న విక్రమ్ మూవీలో నటిస్తున్నారు. 

Also read Naga chaitanya birthday: అఖిల్ కాకుండా నాగ చైతన్యకు మరో తమ్ముడు ఉన్నాడు తెలుసా!

Follow Us:
Download App:
  • android
  • ios