అభిమానులకు షాక్.. రాజకీయాల్లోకి వచ్చేది లేదన్న రజినీ

rajinikanth shock to tamilanadu fans
Highlights

  • తమిళ తంబీలకు షాకిచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్
  • రాజకీయాల్లోకి వచ్చేది లేదని స్పష్టం చేసిన రజినీ
  • ఇప్పుడు అంత అససరం వుందనిపించట్లేదన్న సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. రాజకీయాల్లోకి వస్తే మేలు జరుగుతుందని ఆశిస్తున్న వాళ్లందరి కలలు చెదిరిపోయేలా ఓ ప్రకటన చేశారు. ఇప్పుడప్పుడే రాజకీయాల్లోకి రావాల్సినంత అత్యవసరం ఏమీ లేదని తాను భావిస్తున్నట్టు స్పష్టంచేశారు సూపర్ స్టార్.

 

మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని చెన్నై వెళ్లిన అనంతరం బుధవారం ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడుతూ రజినీకాంత్ ఈ ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి ఎప్పుడొస్తున్నారు అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ రజినీ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

వచ్చే డిసెంబర్ 12వ తేదీన రజినీకాంత్ పుట్టిన రోజు కావడంతో ఆరోజు ఆయన తన రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేసే అవకాశం వుందని అంతా భావించారు. కానీ రజినీ మాత్రం తన పుట్టిన రోజు తర్వాత మరోసారి అభిమానులతో భేటీ అవుతానని మాత్రమే చెప్పారు. ఇప్పుడప్పుడే రాజకీయాల్లోకి రావాల్సినంత అత్యవసరం వున్నట్టు తాను భావించడం లేదని తళైవా చాలా స్పష్టంగా చెప్పేశారు.

 

రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని గత ఏడాది కాలంగా జరుగుతున్న ప్రచారానికి ఒక విధంగా ఈ ప్రకటనతో తెరపడినట్టయింది. దీంతో రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం కోసం ఆయన అభిమానులు ఇంకొంత కాలం వేచిచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.

loader