Asianet News TeluguAsianet News Telugu

కూతురింటికి ఆటోలో వెళ్లిన సూపర్ స్టార్!

సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్న స్థాయి నుండి ఓ మహాశక్తిగా ఎదిగాడు. సూపర్ స్టార్ ఇమేజ్ ని అందుకున్నప్పటికీ ఆయన ఇప్పటికీ ఒదిగే ఉంటాడు. తాజాగా ఆయన చేసిన ఓ పని అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. స్థానిక పోయస్ గార్డెన్ లో ఉన్న తన నివాసం నుండి తన కూతురు ఐశ్వర్య ఇంటికి వెళ్లడం కోసం రజినీకాంత్ ఆటోలో ప్రయాణించారు

rajinikanth's act shocks everyone
Author
Hyderabad, First Published Oct 22, 2018, 10:45 AM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్న స్థాయి నుండి ఓ మహాశక్తిగా ఎదిగాడు. సూపర్ స్టార్ ఇమేజ్ ని అందుకున్నప్పటికీ ఆయన ఇప్పటికీ ఒదిగే ఉంటాడు. తాజాగా ఆయన చేసిన ఓ పని అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది.

స్థానిక పోయస్ గార్డెన్ లో ఉన్న తన నివాసం నుండి తన కూతురు ఐశ్వర్య ఇంటికి వెళ్లడం కోసం రజినీకాంత్ ఆటోలో ప్రయాణించారు. ఎప్పుడూ కార్ లోనే వెళ్లే రజినీకాంత్ ఈ విధంగా ఆటోలో ప్రయాణించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.

రాజకీయాల పరంగా త్వరలోనే రజినీకాంత్ తన కొత్త పార్టీ పేరుని ప్రకటిస్తారని ఆయన సోదరుడు ప్రకటించారు. రజినీకాంత్ రాజకీయ ప్రవేశంలో బీజేపీ జోక్యం లేదని రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణ తెలిపారు. వచ్చే డిసంబర్ నాటికి పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతాయని అన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. రజినీకాంత్ ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తోన్న 'పేటా' అనే సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇవి కూడా చదవండి.. 

శబరిమల వివాదంపై మొదటిసారి స్పందించిన రజినీకాంత్!

'మీటూ'పై రజినీకాంత్ కామెంట్!

Follow Us:
Download App:
  • android
  • ios