శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రోబో 2.0 రోబోకు ఆస్కార్ గ్యారంటీ అంటున్న నిర్మాతలు రెహమాన్ సహా హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్న రోబో 2.0
రజనీకాంత్ రోబో 2.0 సినిమా షూటింగ్ ఈ వారంలోనే పూర్తవుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. దీపావళి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న యూనిట్.. దసరా కానుకగా సెప్టెంబరు 29న ట్రైలర్‌ను విడుదల చేసేందుకు రెడీ అయింది. ఇక, వచ్చే నెల ఏప్రిల్‌లోనే 2.0 టీజర్‌ను విడుదల చేస్తారట.
శంకర్, రజనీకాంత్ అనే సరికి ఈ సినిమా గురించి కావాల్సినన్ని గొప్పలు చెబుతున్నారు చిత్ర నిర్మాతలు. రోబో 2.0 చిత్రంపై మరీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు నిర్మాతలు. ఎంతలా అంటే... సినిమా టీజర్ అయినా విడుదల కాలేదు కానీ.. అప్పుడే ఆస్కార్‌పై ఆశలు పెట్టేసుకున్నారు. 2.0కు కచ్చితంగా ఆస్కార్ వస్తుందని చెప్పేస్తున్నారు.
ఏఆర్ రెహ్మన్ సంగీతం సమకూరుస్తుండడం, పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు సినిమా కోసం పనిచేస్తుండడం, హై టెక్నికల్ వాల్యూస్‌తో సినిమాను తీస్తుండడంతో.. కచ్చితంగా ఏదో ఓ కేటగిరీలో భారత్‌కు 2.0 ఆస్కార్‌ను తెచ్చిపెడుతుందని నిర్మాతలు అంటున్నారు. మరి, ఆస్కార్ ఆశలతో ముందుకెళుతున్న రోబో 2.0 చిత్రం ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో.. ఆస్కార్ బరిలో నిలుస్తుందో చూడాలి.
