సినిమా రిలీజ్ కాకుండానే ఆఫర్ల వెల్లువ

Rajashekar daughter sivani getting offers in all languages
Highlights

కోలీవుడ్ యంగ్ హీరో విశాల్‌తో సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ కూతురు శివాని ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. అయితే, ఇదంతా ఆమె సినిమా ఎంట్రీ ఇస్తున్న విశేషాల గురించి. ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ విశాల్ హీరోగా ఓ సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. 

ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ విశాల్ హీరోగా ఓ సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం కోసం శివానిని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. విశాల్, శివాని జంట ఫ‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంద‌ని ద‌ర్శ‌కుడు భావిస్తున్నాడు. త‌మిళ‌నాడు సంప్ర‌దాయ క్రీడ జ‌ల్లిక‌ట్టు నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్క‌నున్న‌ట్టు తెలిసింది.

అలాగే, మ‌ళ‌యాళం నుంచి కూడా శివానికి మంచి ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. మ‌ళయాళంలో మోహ‌న్‌లాల్ త‌న‌యుడు ప్ర‌ణ‌వ్ హీరోగా ఒక సినిమా రూపొంద‌నుంది. ఈ సినిమాలో క‌థానాయిక పాత్ర కోసం శివానినే అడుగుతున్నార‌ట‌. విశాల్ సినిమాలు త‌మిళ్ తోపాటు తెలుగులోనూ విడుదల అవుతుంటాయి. దీంతో శివాని ఒకే సినిమాతో త‌మిళ‌, తెలుగు చిత్ర సీల‌మ‌ల‌కు ప‌రిచ‌యం కానుంది. మోహ‌న్‌లాల్ త‌నయుడి ఎంట్రీ కూడా ఖ‌రారైతే.. ఆమె మ‌ళ‌యాళంలోనూ ఎంట్రీ ఇవ్వ‌నుంది.

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader