దాదాపు పదేళ్ళ పాటు ఒక్క సక్సెస్ కోసం ఎదురుచూసిన ఒకప్పటి యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్... గరుడ వేగతో మళ్ళీ ఈసారి హిట్ కొట్టాడు. ఇప్పుడు సక్సెస్ వచ్చింది కాబట్టి ఓకే గానీ ఒక వేళ ఏమాత్రం తేడా చేసినా ఈసారి కూడా రాజశేఖర్‌కి మళ్ళీ మూడుకోట్లకు పైగా నష్టం వచ్చేదట. అవును అది రెమ్యునరేషన్ లాస్ కాదు. సొంత ఆస్తిని కోల్పోవాల్సి వచ్చేది. గరుడవేగ కోసం మూడు కోట్లు ఫైనాన్స్ తీసుకున్నారు. నిర్మాత కోటేశ్వర్ రాజు, జీవిత, దర్శకుడు ప్రవీణ్ సత్తారు, హీరో రాజశేఖర్, ఇంకా మరి కొందరు కలిసి తెరకెక్కించిన గరుడ వేగ సినిమా పరిస్థితి ఇదే.

 

ఈ సినిమా కోసం మూడు కోట్లు ఫైనాన్స్ తీసుకున్నారు. అమ్మకాలు జరగలేదు. గరుడ వేగ మంచి సినిమా అని తెలుసు. ట్రయిలర్, టీజర్ బాగున్నాయి అని తెలుసు. కానీ అమ్మకాలు జరగలేదు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇప్పటి వరకు ఈ తరహా సినిమాలు తీయకపోవడం, రాజశేఖర్ నటించి చాలా కాలం కావడం వంటి కారణాలు వున్నాయి.

 

సినిమాను ఆంధ్రలో సురేష్ మూవీస్ దగ్గర, సీడెడ్ లో సాయి కొర్రపాటి దగ్గర వుంచారు. నైజాంలో మర్కాపురం శివకుమార్ కోటి రూపాయిల అడ్వాన్స్ పై ఆడిస్తా అన్నారు. కానీ మరి ఈ మూడు కోట్ల ఫైనాన్స్ క్లియరెన్స్ ఎలా? థియేటర్ల అడ్వాన్స్ లు ఇలాంటివి ట్రయ్ చేసారు కానీ కాలేదని వినికిడి. 5వేల చదరపు అడుగుల ఫ్లాట్ ముందురోజు ఉదయం నుంచి రాత్రి వరకూ ఎంత ప్రయత్నించినా క్లియరెన్స్ రాకపోవడంతో.. చివరకు మంచి పోష్ ఏరియాలోని తన 5వేల చదరపు అడుగుల ఫ్లాట్ ను తాకట్టు పెట్టి మరీ 3 కోట్ల ఫైనాన్స్ క్లియర్ చేసుకున్నాడట.

 

ఇప్పుడు మూవీకి మంచి టాక్ వచ్చింది. ఫ్లాట్ ను మళ్లీ విడిపించుకునే అవకాశం ఏర్పడింది. శాటిలైట్ హక్కులు ఇంకా విక్రయించాల్సి ఉండడం.. మూవీకి మంచి కలెక్షన్స్ కంటిన్యూగా వస్తుండడంతో.. త్వరలోనే తన ఫ్లాట్ ను మళ్లీ విడిపించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలా హిట్ కోసం తపన పడి పడి చివరకు దశాబ్దం నాటి కలను నెరవేర్చుకున్నాడు.