రజినీ కాంత్, శంకర్ కాంబినేషన్లో రోబో 2.0 సినిమా రోబో కి సీక్వెల్ గా రోబో 2.0 విడుదల వాయిదా పడిన రోబో 2.0
సూపర్ స్టార్ రజినీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో 2.0 సినిమా విడుదల మరింత ఆలస్యం కానుంది. మొదట ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయాలని భావించారు. కానీ సినిమాకు సంబంధించి కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇంకా పూర్తి కాలేదట. అందుకే చిత్ర విడుదలను మరి కొన్ని రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తుండగా.. రజినీ సరసన అమీజాక్సన్ నటిస్తున్నారు.
ఈ చిత్ర నైజాం, ఆంధ్రప్రదేశ్ హక్కులను హీరో నితిన్ కి చెందిన గ్లోబల్ సినిమాస్ సంస్థ సొంతం చేసుకుంది. శాటిలైట్ రైట్స్,ఓవర్ సీస్ రైట్స్ కాకుండానే రూ.81కోట్లు చెల్లించి ఈ హక్కులను పొందినట్లు గ్లోబల్ సినిమా స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఒక డబ్బింగ్ సినిమా హక్కుల కోసం ఇంత మొత్తంలో రికార్డు స్థాయిలో చెల్లించడం ఇదే తొలిసారి.
రోబో 2.0 సినిమా రోబో చిత్రానికి స్వీకెల్ అన్న విషయం తెలిసిందే. 7 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ రోబో సినిమా హక్కులను అప్పుడు 27కోట్లకు దక్కించుకున్నారు.
