'మహానటి'పై రాజమౌళి కామెంట్!

rajamouli response on mahanati movie
Highlights

అలనాటి కథానాయిక సావిత్రి జీవితాన్ని తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు నాగ్ అశ్విన్

అలనాటి కథానాయిక సావిత్రి జీవితాన్ని తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ బయోపిక్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రసంసల జల్లు కురిపిస్తూనే ఉన్నారు. ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీకు చెందిన పలువురు ప్రముఖులు సైతం ఈ సినిమాను కొనియాడుతున్నారు. పెద్ద సినిమాలను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే దర్శకధీరుడు రాజమౌళి 'మహానటి' చిత్రాన్ని కూడా మొదటిరోజే చూసి చిత్రబృందాన్ని అభినందించారు.

''నేను చూసిన అద్భుతమైన నటనలలో కీర్తి సురేష్ నటన ఒకటి. ఆమె సావిత్రిని అనుకరించలేదు.. స్వయంగా సావిత్రినే మన కళ్ల ముందుకు తీసుకొచ్చింది. ఇక జెమినీ గనేషన్ గా దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించాడు. ఇప్పుడు నేను తనకు ఫ్యాన్ అయిపోయాను'' అంటూ రాజమౌళి ప్రశంసించారు. రాజమౌళితో పాటు మరికొందరు నటులు కూడా సోషల్ మీడియా ద్వారా 'మహానటి' టీమ్ కు అభినందనలు తెలియజేస్తున్నారు.  

loader