జక్కన్న,రామ్ చరణ్,ఎన్టీఆర్ మూవీ అప్డేట్-ఓన్లీ యాక్షన్

జక్కన్న,రామ్ చరణ్,ఎన్టీఆర్ మూవీ అప్డేట్-ఓన్లీ యాక్షన్

దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో కలిపి సరదాగా వున్న సమయంలో తీసిన ఫోటోను తన సోషల్ మీడియా పేజ్ ట్విటర్ లో పోస్ట్ చేసి సంచలనానికి తెరతీసిన సంగతి తెలిసిందే. ఈ పోస్ట్ పై రకరకాల ఊహాగానాలు సర్కులేట్ అవుతున్నాయి. ముఖ్యంగా.. ఈ కాంబినేషన్ లో భారీ చిత్రం తెరకెక్కబోతోందని, త్వరలోనే ప్రారంభమవుతుందనేది ప్రధాన చర్చ. ఆ చర్చను ఖండించకపోవడంతో కొత్త కాంబో మూవీ వార్తకు మరింత బలం చేకూరింది.

 

తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో రాజమౌళి మల్టీ స్టారర్ మూవీ పక్కా అని తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు కూడా జరిగాయని అంటున్నారు. దానిలో భాగంగానే చరణ్, తారక్‌తో తీసుకున్న ఫొటోను రాజమౌళి ట్వీట్ చేశారని టాక్. ఒకవేళ ఈ వార్త అబద్ధం అయ్యుంటే ఇప్పటికే రాజమౌళి స్పందించేవారు కదా అనే వాదన వినిపిస్తోంది. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. జూన్‌లో ముహూర్తం ఫిక్స్ చేసి.. ఆగస్టు నుంచి షూటింగ్ మొదలుపెడతారని టాక్. ఈ మూవీని 2019లో విడుదల చేసే ఆలోచన చేస్తున్నారట.

బాహుబలి చిత్రంలో అబ్బురపరిచే గ్రాఫిక్స్ వాడిన రాజమౌళి.. చరణ్,ఎన్టీఆర్ ల సినిమాలో మాత్రం గ్రాఫిక్స్ అంత ప్రాధాన్యత ఇవ్వడంలేదని సమాచారం. ఇద్దరు మాస్ ఫాలోయింగ్ వున్న హీరోలే కాక మాంచి స్టఫ్ ఉన్న హీరోలు.. కాబట్టి.. యాక్షన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా త్వరలో వెలువడుతుందని సమాచారం.

 

ఈ మధ్య పెద్ద హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు వచ్చినా అవి కమర్షియల్ విజయాలను అందుకోలేదు.కానీ రాజమౌళి సినిమా అంటే మంచి కమర్షియల్ హంగులు, యాక్షన్ సన్నివేశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి.. చరణ్, ఎన్టీఆర్ మార్కెట్‌ను బట్టి ఈ మల్టీస్టారర్ రికార్డులు తిరగరాయడం ఖాయం అనే చర్చ జరుగుతోంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos