తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలువీధులా రెపరెపలాడించి టాలీవుడ్ జెండా ఎగరేసిన దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , రాంచరణ్ ల కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభం కానున్న ఈ చిత్రం కోసం అప్పుడే టైటిల్ అన్వేషణలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు "ఇద్దరూ ఇద్దరే" అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం.

 

ఇదే టైటిల్ తో గతంలో రెండు తెలుగు సినిమాలు వచ్చాయి. కృష్ణ - శోభన్ బాబుల కాంబినేషన్లో ఒకసారి, అక్కినేని నాగేశ్వర రావు- నాగార్జున ల కాంబినేషన్లో మరోసారి. అయితే నాగేశ్వరరావు- నాగార్జున ల కాంబినేషన్ లో వచ్చిన ఇద్దరూ ఇద్దరే డిజాస్టర్ కాగా కృష్ణ - శోభన్ బాబు ల ఇద్దరూ ఇద్దరే హిట్ అయ్యింది.

 

ఇద్దరు కూడా స్టార్ హీరోలు కాబట్టి ఆపై తెలుగు ప్రేక్షకులను అలరించాలంటే వాళ్ళ అభిరుచి మేరకు టైటిల్స్ ఉండాలి కాబట్టి ఇక్కడ వ్యక్తి ఆరాధన ఎక్కువ కాబట్టి ఈ టైటిల్ పట్ల మొగ్గు చూపుతున్నారట రాజమౌళి. పైగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ , చరణ్ లు ఇద్దరు కూడా పోలీస్ అధికారులు గా నటించనున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఈ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ప్రభంజనం సృష్టించడం ఖాయం.