రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మూవీ..వైరల్

First Published 19, Nov 2017, 10:45 AM IST
rajamouli ramcharan ntr combination movie
Highlights
  • రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిపి దిగిన ఫోటోను ట్విటర్ లో పెట్టిన జక్కన్న
  • ఫిబ్రవరిలో ఈ క్రేజీ కాంబినేషన్ లో ఓ ఎపిక్ ప్రారంభం కాబోతోందంటూ వైరల్ టాక్
  • ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ పై చర్చలు

దర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ చిత్రం రాబోతోందనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇద్దరు యువ హీరోలతో కలసి రాజమౌళి దిగిన ఫోటో సోషల్ మీడియాలో పెట్టి సంచలనం సృష్టించాడు. చరణ్, తారక్‌లను పక్కన కూర్చోబెట్టుకుని చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోను రాజమౌళి తన అధికారిక ట్విట్టర్‌లో పెట్టారు. మాస్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు పెద్ద హీరోలు ఇలా రాజమౌళితో ఫొటో దిగడంతో రూమర్లు ప్రారంభమయ్యాయి.


చరణ్, తారక్‌తో రాజమౌళి మల్టీస్టారర్ పక్కా అని, వచ్చే ఏడాది ఆగస్టులో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు. ఇప్పటికే కథా చర్చలు జరిగాయని, డి.వి.వి.దానయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారని రూమర్లు చక్కర్లు కొట్టేస్తున్నాయి. అయితే దీనిపై అధికార ప్రకటన వెలువడాల్సి ఉందని అంటున్నారు.

 

ఇక ఈ ఫోటో వైరల్ కావడం దాంతోపాటు మూవీ ప్రస్తావన గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చ సాగుతోంది. అయితే ఈ మల్టీస్టారర్ మూవీ పుకార్లను సోషల్ మీడియాలో కొంత మంది కొట్టిపారేస్తుంటే.. మరికొందరు నిజంగా ఈ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ వస్తే ఎంత బాగుంటుందో అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదో విషయం లేకుండా ఇలాంటి ఫోటో ఒకటి రాజమౌళి ఎందుకు పోస్ట్ చేస్తాడని, ఖచ్చితంగా మూవీ వుంటుందని, ఫిబ్రవరిలోనే ప్రారంభమవుతుందని మరి కొందరి వాదన. ఈ కాంబినేషన్ తెలుగు వారికి పండగే కదా.

 

loader