రాజమౌళితో కలిసి పారితోషికం లేకుండా మూవీ చేయనున్న చరణ్,ఎన్టీఆర్

First Published 22, Nov 2017, 4:30 PM IST
rajamouli ntr ramcharan not taking remuneration for big project
Highlights
  • రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మూవీకి ప్లాన్స్
  • ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్న డీవీవీ దానయ్య
  • పారితోషికం లేకుండా పనిచేసి దానయ్యతో సమాన వాటా తీస్కోనున్న ముగ్గురు

బాహుబలి చిత్రంతో నేషనల్ స్టార్ డైరెక్టర్ అయిపోయిన రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ పై గత కొంత కాలంగా రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఊహాగానాలకు తెరదించుతూ చరణ్ జూనియర్ లతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి కాంబినేషన్ అంటే ఇదేరా అనిపించాడు జక్కన్న. అయితే రాజమౌళి, చరణ్, జూనియర్ల కాంబినేషన్ లో.. మూవీ పక్కాగా వుందనే సమాచారం మాత్రం అందుతోంది.

 

రాజమౌళి స్వయంగా తన ట్విటర్ లో ఈ మల్టీ స్టారర్ మూవీ గురించి వెల్లడించడంతో... సినిమా బడ్జెట్, బిజినెస్ కు సంబంధించిన చర్చలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడవిడి చేస్తున్న వార్తలప్రకారం ఈభారీ మల్టీ స్టారర్ ఒకకొత్త బిజినెస్ ఫార్మలాలో నిర్మింపబడుతోంది అనిటాక్. రాజమౌళి, జూనియర్, చరణ్ లు ఈభారీ మల్టీ స్టారర్ కు సంబంధించి ఒక్క రూపాయి కూడ పారితోషికం తీసుకోరట. అయితే ఈభారీ మూవీ ప్రాజెక్ట్ కు జరిగే బిజినెస్ ను నాలుగు భాగాలుగా విభజించి రాజమౌళి చరణ్ జూనియర్ లతో పాటు ఈ సినిమాను నిర్మిస్తున్న డీవీవీ దానయ్య కూడా  వాటా తీసుకుంటారని ఫిలింనగర్ టాక్.

 

ముగ్గురికీ పారితోషికం లేకపోయినా అత్యంత భారీస్థాయిలో నిర్మించే ఈమూవీ బడ్జెట్ 100 కోట్లు మించి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం రాజమౌళికి ఉన్న ఇమేజ్ రీత్యా ఈమూవీని దక్షిణాదిలోని అన్ని భాషలలోను విడుదల చేయడంతో ఈమూవీ పై దాదాపు 300 కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

 

2018 మధ్యలో ఈసినిమా షూటింగ్ మొదలుపెట్టి 2019 ప్రధమార్దానికి ఈమూవీ నిర్మాణ పనులుపూర్తిచేసి 2019 సమ్మర్ ను టార్గెట్ చేసేవిధంగా ఈసినిమా రిలీజ్ ప్లాన్ ఉంది అనిఅంటున్నారు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి కథ విషయమై విజయేంద్ర ప్రసాద్ తో రాజమౌళి ప్రాధమిక ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈభారీ మల్టీ స్టారర్ కథను జనవరిలోగా ఫైనల్ చేసి ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన 2017 జనవరి 1న ఇవ్వాలని రాజమౌళి ఆలోచన అనిఅంటున్నారు. పారితోషికం లేకుండా ప్లాన్ చేస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోంది అనుకోవాలి.

loader