రీమేక్ కథతో చరణ్-ఎన్టీఆర్ ల మల్టీస్టారర్?

rajamouli multistarrer is remake of karan arjun movie
Highlights

రామ్ చరణ్-ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మల్టీస్టారర్ సినిమాను 

రామ్ చరణ్-ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మల్టీస్టారర్ సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాదిలోనే మొదలుకానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.

అయితే సినిమా మొదలవ్వకముందే ఈ సినిమా కథపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కథ ప్రకారం చరణ్-ఎన్టీఆర్ లు అన్నదమ్ములుగా కనిపించనున్నారంటూ వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓ బాలీవుడ్ సినిమాకు రీమేక్ అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. రచయిత విజయేంద్రవర్మ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్-షారుఖ్ ఖాన్ లు కలిసి నటించిన 'కరణ్ అర్జున్' అనే సినిమా కథ ఆధారంగా రాజమౌళి మల్టీస్టారర్ కు కథ సిద్ధం చేస్తున్నాడని టాక్.

90 లలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం అందుకుంది. ఇప్పుడు ఆ సినిమా లైన్ ఆధారంగా రాజమౌళి సినిమా కోసం కొత్తగా కథ రాస్తున్నాడట విజయేంద్రప్రసాద్. గతంలో 'భజరంగి భాయ్ జాన్' సినిమా కథ టాలీవుడ్ లో వచ్చిన 'పసివాడి ప్రాణం' కథ ఆధారంగా రాశానని చెప్పుకొచ్చాడు ఈ రైటర్. ఇప్పుడు బాలీవుడ్ కథను టాలీవుడ్ కు పరిచయం చేయబోతున్నాడు. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సివున్నాయి!

loader