బాహుబలి విజయం రాజమౌళిని ఇంటర్నేషనల్ లెవెల్ లో పాపులర్ అయ్యేలా చేసింది. ఇప్పుడు రాజమౌళి రాబోయే సినిమాకోసం తెలుగు వాళ్లు మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఎం సినిమా తీస్తాడా అని ఎదురు చూస్తున్న తరుణంలో రాం చరణ్ ఎన్టీఆర్ లతో మల్టిస్టారర్ తీయబోతున్నాడు అన్న వార్త ప్రేక్షకులలో ఆనందోత్సాహాలు నింపింది. 

అంతా బాగానే ఉంది. మరి రామ్ చరణ్ ఎన్టీఆర్ ల పక్కన హీరోయిన్లు ఎవరు అన్నది ఇండస్ట్రీలోనే ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. తొలి ప్రేమ తో మొన్ననే హిట్ అందుకున్న రాశి ఖన్నా తారక్ కు జతగా నటించబోతున్న విషయం ఈమధ్యనే తెలిసింది. మరి మన మెగా హీరో పక్కన ఎవరు చేయబోతున్నారు అని అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉండగా సమాచారం వచ్చేసింది. రంగస్థలంలో రామ లక్ష్మీ గా సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబు అదే చరణ్ పక్క ఆ ఆడి పడుతున్న సమంత నే ఇందులో కూడా హీరోయిన్. రంగస్థలం లో వీళ్ళ కెమిస్ట్రీ కి ఫాన్స్ ఏ కాదు రాజమౌళి కూడా ముగ్దుడైపోయి మళ్ళి ఈ జంట తోనే సినిమా తీయాలి అని నిర్ణయించేసుకున్నదంట. ఇది సమంత కు కూడా రాజమౌళి తో ఈగ తర్వాత చేస్తున్న రెండో చిత్రం. 

ఇప్పటిదాకా మూడు సినిమాలు కాజల్ తో - రెండు రకుల్ తో చేసిన చెర్రీ ఇప్పుడు సమంత తో కూడా రెండో చిత్రానికి సై అనేసాడు. రంగస్థలం కనుక హిట్ అయితే కచ్చితంగా ఈ జంట పై మరిన్ని అంచనాలు పెరిగే అవకాశాలున్నాయి.