Asianet News TeluguAsianet News Telugu

అల్లు అరవింద్ మాట తప్పారు.. అందుకే మగధీర 100రోజుల ఫంక్షన్ కు వెళ్లలేదు

  • మగధీర 100 రోజుల ఫంక్షన్ కు ఎందుకు రాలేదో చెప్పేసిన రాజమౌళి
  • అల్లు అరవింద్ గారు ముందు అనుకున్న విధంగా చేయలేదు
  • 100 రోజుల ఫంక్షన్ కు అరవింద్ గారి వల్లే రాలేదన్న జక్కన్న
rajamouli gives clarity on clashes with ace producer allu arvind

బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికకి చెప్పిన రాజమౌలికి హిట్లు కొత్తకాదు. దేశంలో నెంబర్ వన్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా బాహుబలి రికార్డులకెక్కినా... రాజమౌళి ప్రతీ సినిమా హిట్టే. వాటిలో అల్లు అరవింద్ నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

అయితే.. మగధీర చిత్ర వంద రోజుల వేడుకకు జక్కన్న రాజమౌళి హాజరు కాలేదు. హుబలి కంటే ముందు 2009లోనే రాజమౌళి తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం 'మగధీర'. అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్. ఆ సందర్భంలో ఓ వైపు మగధీర విజయాన్ని మెగా ఫ్యామిలీ, అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్న తరుణంలో... కొన్ని రూమర్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. సినిమా విజయానికి ప్రధాన కారణమైన రాజమౌళిని మెగా ఫ్యామిలీ పక్కన పెట్టేసిందని, సినిమా విజయంలో ఆయన ప్రాధాన్యతను కావాలనే పంచుకోవడం లేదనే వార్తలు వచ్చాయి.

అప్పట్లో మగధీర విజయానికి కారణం రాజమౌళి కాదు.. రామ్ చరణ్, మెగా ఫ్యామిలీ ఇమేజే కారణం అనేలా సీన్ క్రేయేట్ చేయడంతో... హర్టైన రాజమౌళి కావాలనే ‘ఈగ'ను పెట్టి సినిమా తీసి తన సత్తా చాటుకున్నారని అప్పట్లో జనం పుంఖాను పుంఖాలుగా మాట్లాడేసుకున్నారు. రాసేశారు. అయితే మగధీరపై వచ్చిన ఈ వార్తలపై రాజమౌళి తాజాగా ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' ఇంటర్వ్యూలో వివరంగా మాట్లాడారు.

అసలు మగధీర సక్సెస్ లో తనకు క్రెడిట్ ఇవ్వకపోవడం అంటూ ఏమీలేదని రాజమౌలి స్పష్టం చేశారు. మగధీర యాభై రోజులు ఆడిన తరువాత నేను, చరణ్‌ గుర్రంపై రైడ్‌ చేస్తున్న పోస్టర్‌ డిజైన్‌ చేయించారు. అరవింద్‌గారు ఆ పోస్టర్‌ చూపించారు. కనిపించడం ఇష్టమే కానీ, మరీ అంత వద్దు అని చెప్పాను. అయినా వినకుండా వేయించారు. సక్సెస్‌లో నాకు క్రెడిట్‌ ఇవ్వకపోవడం అనే మాటేమీ లేదు. అది వాస్తవం కాదు అని రాజమౌళి తెలిపారు.

 

మగధీరకు ముందు.. సినిమాలు వంద రోజులు ఆడినా ఆడకపోయినా.. థియేటర్ల సంఖ్య పెంచేసి.. ఆ నెంబర్ ప్రకటించేవారు. అన్ని సినిమాలకూ ఇలాగే చేసేవారు. నాకేమో అలా నచ్చేది కాదు. ‘సింహాద్రి' సినిమా సరిగ్గా గుర్తులేదు కానీ చాలా థియేటర్లలో వంద రోజులు ఆడింది. అది జెన్యూన్‌. చాలా ఆనందపడ్డాం. అక్కడితో ఆగకుండా 175 డేస్‌ కూడా ఆడించాలని చెప్పి 15 థియేటర్లలో ఆడితే, మరో 15 థియేటర్లలో ఆడించారు. నాకది చాలా ఇబ్బందిగా ఉండేది. ‘సింహాద్రి' సినిమాకే కాదు, అన్ని సినిమాలకూ, అందరి హీరోలకూ ఇలానే ఉండేది.

 

నేను అరవింద్‌గారితో సినిమా మొదలుపెట్టినపుడు ఈ విషయాన్నే చర్చించాం. ‘అలాంటి ప్రకటనలకు మనం దూరంగా ఉందాం సార్‌' అన్నాను. ఆయన ‘ఓకే డన్‌' అన్నారు. కానీ.. మేము ముందుగా పరస్పరం అనుకున్నది ఒకటి.. అల్లు అరవింద్ గారు చేసింది మరొకటి. 100 డేస్‌ థియేటర్స్‌ పెంచడం మొదలుపెట్టారు. అప్పుడు నేను అరవింద్‌గారి దగ్గరికి వెళ్లి.. ‘‘మనం అలాంటి ప్రకటనలు వద్దనుకున్నాం కదా'' అనడిగాను. అప్పుడాయన ‘నాకూ ఆపేయాలనే ఉంది రాజమౌళీ.. కానీ, ఫ్యాన్స్‌ తో చాలా ఇబ్బందిగా ఉంది. మాకుండే డెలికేట్‌ ఇష్యూస్‌ నీకు తెలియదు' అన్నారు, ఆయన అలా చేయడం నాకు నచ్చలేదు అని రాజమౌళి వివరించారు.

 

అందుకే అల్లు అరవింద్ గారు చేసిన దానికి కోపంతో ‘100 డేస్‌ ఫంక్షన్‌కు రాలేను' అని చెప్పాను. ‘నువ్వు రాకపోతే సిట్యుయేషన్‌ ఎలా ఉంటుందో తెలుసా' అన్నారు. నాకర్థమయింది కానీ రాలేను అని చెప్పాను. తప్ప గొడవలేం రాలేదు. వేరే ప్రొడ్యూసర్‌తోనైతే అంతవరకు కూడా రాదు. అరవింద్‌గారు అంత చనువు ఇచ్చారు కాబట్టే మాట్లాడాను అని రాజమౌళి తాజాగా ఆర్కే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios