Asianet News TeluguAsianet News Telugu

శివగామి పాత్రకు రాజమౌళి నన్నడిగాడు-మంచులక్ష్మి

  • బాహుబలిలో అవకాశమిస్తే వద్దాన్నానంటున్న మంచు లక్ష్మి
  • శివగామి పాత్రలో నటించమని ఆఫర్ ఇచ్చారన్న లక్ష్మి
  • ప్రభాస్ తల్లిగా నటించడం ఇష్టంలేక వదులుకున్న మంచు వారి అమ్మాయి
rajamouli asked for shivagami manchu lakshmi

‘బాహుబ‌లి’లో శివ‌గామి పాత్ర‌కు రాజమౌళి అతిలోక సుంద‌రి శ్రీదేవిని నటించమని అడిగిన విషయం మనకు తెలుసు. రాజ‌మౌళి కూడా దీన్ని ఒప్పుకున్నాడు. ట‌బూను కూడా శివగామి పాత్రకోసం క‌న్సిడ‌ర్ చేసిన‌ట్లు వార్త‌లొచ్చాయి. కానీ ఈ పాత్ర‌కు త‌న‌ను కూడా రాజ‌మౌళి సంప్ర‌దించాడని చెప్పింది మంచు ల‌క్ష్మీప్ర‌స‌న్న‌. ఆలీ హోస్ట్ చేసే ఒక టీవీ షోలో మంచు ల‌క్ష్మి ఈ విష‌యాన్ని వెల్లడించింది. శివ‌గామి పాత్ర‌లో నటించాలని మిమ్మ‌ల్ని అడిగార‌టగా అని ఆలీ అడగ్గా.. అది రూమ‌ర్ కాద‌ని వాస్త‌వ‌మ‌ని చెప్పింది ల‌క్ష్మి. మ‌రి ఆ పాత్ర‌ను ఆమె ఎందుకు కాదందో త‌న మాట‌ల్లోనే తెలుసుకుందాం.

‘‘శివ‌గామి పాత్ర‌కు న‌న్ను అడ‌గ‌డం రూమ‌ర్ కాదు. అది నిజమే. రాఘ‌వేంద్ర‌రావుగారి అబ్బాయి ప్ర‌కాష్ ఫోన్ చేసి నాకు ఆ పాత్ర ఆఫ‌ర్ చేశాడు. ఐతే నేనే నో చెప్పాను. శివ‌గామి పాత్ర న‌చ్చ‌క ఇలా చెప్ప‌లేదు. ప్ర‌భాస్ కు అమ్మ‌గా న‌టించ‌డం అనే ఆలోచ‌న నాకు న‌చ్చ‌లేదు. ఆ ఆలోచ‌నే ఊహించ‌లేను. సినిమాలో నాకు అమ్మ ఫీలింగ్ కాకుండా ఇంకో ఫీలింగ్ వ‌స్తే క‌ష్టం. న‌న్ను ప్ర‌భాస్ అమ్మ‌గా ఎలా ఊహించుకున్నారో అని రాజ‌మౌళిని కూడా రెండు మాట‌లు అన్నాను” అని చెప్పుకొచ్చింది మంచులక్ష్మి.

తనకంటే ముందు శ్రీదేవి.. ట‌బుల‌ను కూడా ఈ పాత్ర‌కు అడిగారని, వాళ్ల లీగ్ లో తననూ చేర్చినందుకు చాలా హ్యాపీ అని అంటోంది. రాజ‌మౌళి ఇంకేదైనా పాత్ర ఆఫ‌ర్ చేస్తే నేను త‌ప్పకుండా చేస్తానంటోంది. ఐతే శివ‌గామి పాత్ర‌కు తన వాయిస్ ఉండుంటే వేరేగా ఉండేదంటోంది. వాయిస్ ఇవ్వ‌మంటే మాత్రం ఇచ్చేదాన్నని చెప్తోంది. కానీ ప్ర‌భాస్ త‌ల్లిగా నటించ‌డం మాత్రం నా వ‌ల్ల కాదని చెప్పింది మంచువారి లక్ష్మీ బాంబ్.

Follow Us:
Download App:
  • android
  • ios