యంగ్ డైరెక్టర్స్ కు రాజమౌళి ఛాలెంజ్!

rajamouli accepts kavitha's challenge
Highlights

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి తెలంగాణ ఎంపీ కవిత ఛాలెంజ్ విసిరింది. దీన్ని స్వీకరించిన రాజమౌళి మర్రి, గుల్మొహర్, వేప మొక్కలని నాటాడు. తిరిగి ఆయన పుల్లెల గోపీచంద్, కేటీఆర్, యువ దర్శకులు సందీప్ వంగ, నాగ్ అశ్విన్ లకు ఛాలెంజ్ విసిరారు.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. దీనికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఛాలెంజ్ స్వీకరించిన ప్రముఖులు మరో ముగ్గురికి ఛాలెంజ్ విసురుతూ గ్రీన్ ఛాలెంజ్ ను ప్రోత్సహిస్తున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి తెలంగాణ ఎంపీ కవిత ఛాలెంజ్ విసిరింది. దీన్ని స్వీకరించిన రాజమౌళి మర్రి, గుల్మొహర్, వేప మొక్కలని నాటాడు.

తిరిగి ఆయన పుల్లెల గోపీచంద్, కేటీఆర్, యువ దర్శకులు సందీప్ వంగ, నాగ్ అశ్విన్ లకు ఛాలెంజ్ విసిరారు. ఆయన మొక్కలు నాటుతున్నట్లుగా తీసిన ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా ఓ మల్టీస్టారర్ సినిమాను రూపొందించనున్నారు రాజమౌళి.

దీనికి 'ఆర్ఆర్ఆర్' అనేది వర్కింగ్ టైటిల్. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు. ఇద్దరు స్టార్ హీరోల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 

loader