చిత్రం: రాజా ది గ్రేట్ నటీనటులు: రవితేజ, మెహ్రీన్, శ్రీనివాస రెడ్డి, రాధిక, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, సాయి కుమార్ తదితరులు సంగీతం: సాయి కార్తీక్ కథ, దర్శకత్వం: అనిల్ రావిపూడి నిర్మాత: దిల్ రాజు ఏసియానెట్ రేటింగ్-3/5

మాస్ మహారాజ్ రవితేజ.. ‘కిక్ 2’, ‘బెంగాల్ టైగర్’ సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘రాజా ది గ్రేట్’ అంటూ ఓ కొత్త తరహా పాత్రతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీపావళి సందర్భంగా బుధవారం విడుదలైన ఈ సినిమాలో రవితేజ అంధుడిగా నటించాడు. రవితేజకు జంటగా మెహ్రీన్ పిర్జాదా కనిపించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. భారీ తారాగణంతో కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

కథ: 
వివాన్ భటేనా (మెయిన్ విలన్) కు తన తమ్ముడు పంచప్రాణాలు. అతనికి ఏమైనా జరిగితే తట్టుకోలేడు. అలాంటి తమ్ముడిని ఒక పోలీసాఫీసర్ (ప్రకాష్ రాజ్) కాల్చి చంపడంతో, ప్రతీకారం తీర్చుకోవడానికి అతని కూతుర్ని (మెహ్రీన్) కళ్ల ఎదుటే చంపబోతాడు. కూతుర్ని రక్షించుకునే ప్రయత్నంలో పోలీస్ అధికారి మరణిస్తాడు. ప్రకాష్ రాజ్ స్నేహితుడైన మరో పోలీస్ అధికారి(సంపత్ రాజ్), తన స్నేహితుడి కూతుర్ని కాపాడటానికి ఒక సీక్రెట్ ఆపరేషన్ ప్లాన్ చేస్తాడు. పుట్టుకతో అంధుడైన రాజా(రవితేజ) తల్లి (రాధిక) సంపత్ వద్ద కానిస్టేబుల్ గా చేస్తుంటుంది. ఆమె ప్రాథేయపడటంతో, తనకు ఇష్టం లేకపోయినా, రాజాను కూడా ఈ సీక్రెట్ ఆపరేషన్ లో భాగంగా చేస్తాడు సంపత్. ఇక అక్కడి నుంచి రాజా తన తెలివితేటలతో ఆ అమ్మాయిని ఎలా రక్షించాడు అన్నదే మిగతా కథ.

విశ్లేషణ :

ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా వుంది . రవి తేజ గుడ్ది వాడిగా ఇంట్రడ్యూస్ చేసిన సన్నివేశాలు చాల ఎంటెర్టైనింగ్ అనిపించాయి . యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా వున్నాయి . ఇక సాంగ్స్ కూడా బనే ఉన్నాయని చెప్పాలి . ఫస్ట్ హాఫ్ చాల స్పీడ్ గా సాగింది . ఇంటర్వెల్ ఎపిసోడ్ ఈ సినిమా ని పీక్స్ కి తీసుకెళ్తుంది . ఫస్ట్ హాఫ్ యాక్షన్, కామెడీ తో నిది వుంది .

ఇక సెకండ్ హార్డ్ విషయానికి వస్తే , కొంచం ప్రెడిక్టబుల్ గా వుంది . కానీ రవి తేజ నటన నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తుంది ఈ చిత్రాన్ని . సినిమా మొత్తం గ్రిప్పింగ్ గ వున్నసెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల చాల స్లో నఱషన్ అనిపించింది . ఎమోషనల్ కంటెంట్ బాగా నరేట్ చేసారు దర్శకుడు . సాంగ్స్ డిసెంట్గా వున్నాయి . యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాని బాగా ఎలేవేటే చేశాయని చెప్పాలి . కానీ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే తో సెకండ్ హాఫ్ యావరేజ్ గా సాగుతుంది .

నటీనటులు: 
రవితేజ ఒక మాస్ హీరో. అయినా ఇలాంటి కథను యాక్సెప్ట్ చేయటం చాలా మంచి విషయంగా చెప్పుకోవాలి. అవడానికి హీరో దివ్యాంగుడే అయినా, ఎక్కడా కూడా అందుకు ప్రేక్షకుడు జాలి పడేలా ఆ పాత్ర ఉండదు. పైపెచ్చు అదే పాత్రతో కామెడీ పండిచాడు దర్శకుడు. రవితేజ తన పాత్రకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేశాడు. ఇక కథంతా తన చుట్టూనే తిరిగే అమ్మాయి పాత్రలో మెహరీన్ కూడా ఇమిడిపోయింది. మెయిన్ విలన్ కు డబ్బింగ్ అక్కడక్కడా సింక్ అవ్వలేదు. మిగిలిన పాత్రలన్నీ కూడా అవసరార్ధం ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటాయి. అన్నపూర్ణ, పృథ్వి పాత్రలు బాగా నవ్విస్తే, రాధిక మాత్రం డ్యాన్సులతో పాటు విలన్ కు డైలాగుల ఛాలెంజ్ కూడా చేసింది. రాశిఖన్నా, సప్తగిరి, తాగుబోతు రమేష్, సంపూర్ణేష్ బాబు ఇలా వచ్చి అలా వెళ్లిపోతారు. ఓవరాల్ గా పెర్ఫామెన్స్ పరంగా బాగుంది.

సాంకేతిక నిపుణులు:
పటాస్, సుప్రీం లాంటి సినిమాలతో తనలో ఉన్న మాస్ టచ్ ను, కామెడీ టైమింగ్ టాలెంట్ ను చూపించాడు అనిల్ రావిపూడి. తన కెరీర్ లో మొదటిసారి ఎస్టాబ్లిష్డ్ స్టార్ హీరోతో సినిమా తీస్తున్నా, చాలా క్లారిటీగా తను తీయాలనుకున్నది తీశాడు. సుప్రీం లో దివ్యాంగుల ఫైటింగ్ సీన్ తో వారిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్న అనిల్ రావిపూడి, తన తర్వాతి సినిమాకు హీరో పాత్రనే దివ్యాంగుడిగా డిజైన్ చేసుకోవడం గొప్ప విషయం. ఇది టాలీవుడ్ లో ఇప్పటి వరకూ ఎవరూ చేయని రిస్క్ గా చెప్పాలి. ఇక అతను రాసిన డైలాగులతో పాటు సన్నివేశాలు కూడా అద్భుతంగా పండాయి. ఫ్యూచర్ లో మరింత మంది స్టార్ హీరోలు అనిల్ తో సినిమాలు సైన్ చేస్తారనడంలో నో డౌట్. ఇక సినిమాలో వీలైనన్ని చోట్ల కామెడీ పెట్టేయాలని ట్రై చేయడం వల్ల కథ అనుకున్నంత సీరియస్ గా సాగదు. సినిమా కథ ఏంటి అన్నది ముందే మనకు తెలిసిపోతుంది. మిగిలిన సినిమా అంతా అంధుడిగా హీరో ఎలా నెగ్గుకొచ్చేస్తాడు అన్నదాని గురించే ఆడియన్స్ వెయిట్ చేస్తుంటారు. ఇక్కడే దర్శకుడు ఇంకాస్త టైట్ గా సీన్స్ రాసుకుని ఉంటే బాగుండేది. ఇక సాయి కార్తీక్ కూడా ఫస్ట్ టైమ్ ఒక పెద్ద హీరోకు సంగీతం అందించినా, అవకాశాన్ని సక్సెస్ ఫుల్ గా ఉపయోగించుకున్నాడు. సినిమాలో పాటలు బాగా పాపులర్ అవడం విశేషం. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ కు తగ్గట్గుగా ఇచ్చాడు. మోహన కృష్ణ సినిమాటోగ్రఫీ కనులవిందుగా సాగింది. సెకండాఫ్ లో ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుందేమో..! దిల్ రాజు నిర్మాణ విలువలు రొటీన్ గానే రిచ్ గా వున్నాయి.

ప్లస్ పాయింట్స్:
రవితేజ పెర్ఫామెన్స్
డైరెక్షన్

మైనస్ పాయింట్స్:
హెవీ కామెడీ
ముందే తెలిసిపోయే కథ

చివరగా:

‘రాజా ది గ్రేట్’ అన్ని వర్గాలకు నచ్చే ‘ఓ వెరైటీ కామెడీ ఎంటర్ టైనర్’