Asianet News TeluguAsianet News Telugu

Brahmamudi: అపర్ణ కాళ్లు పట్టుకున్న కనకం.. కళ్యాణ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రాజ్!

Brahmamudi: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్స్ కి పోటీ ఇస్తూ బాగా దూసుకుపోతుంది. నిజ జీవితానికి దగ్గరగా ఉండటంతో ఈ కథ ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇక ఈరోజు మార్చి 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..
 

raj warns to kalyan in todays brahmamudi serial gnr
Author
First Published Mar 17, 2023, 11:49 AM IST

ఎపిసోడ్ ప్రారంభంలో కావ్యని చూడకపోతే గుండె ఆగిపోయేలాగా ఉంది అంటుంది కనకం. సరే వెళ్ళు కానీ అక్కడ వాళ్ళు ఏమైనా అంటే బాధపడకు కృష్ణమూర్తి తప్పు నాదే కదా అసలు బాధపడను అంటుంది కనకం. అప్పు ఆటో బుక్ చేస్తుంది. మరోవైపు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి మీకు తెలియదేమో ఇలాంటివి కింద పడకూడదు అందుకే పట్టుకున్నాను అంటుంది కావ్య.

పళ్ళాన్ని దేవుడు ముందు పెట్టి ఈ రోజు నుంచి నా బాధ్యతని ఆ దేవుడే చూసుకుంటాడు  అంటుంది కావ్య. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు మీ అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నట్లు ఉన్నావు అంటాడు రాజ్. మీకు ఇంత అహంకారం ఉంది కదా మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అంటుంది కావ్య. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ కోప్పడుతాడు రాజ్.

అమ్మ గురించి మాట్లాడితే ఎవరికైనా అలాగే ఉంటుంది అంటుంది కావ్య. అంతలోనే కనకం వస్తుంది. ఆమెని చూసి ఆనందంగా పరిగెడుతుంది కావ్య. రాజ్ మాత్రం కోపంతో మీరు ఎవరు, ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. కన్న బిడ్డని చూసుకోవడానికి వచ్చాను అంటుంది కనుక ఆ బంధం నిన్నటితోనే తెగిపోయింది అంటాడు రాజ్.

తెగితే తెగిపోయేది కాదు అంటుంది కనకం. అయితే మీ ఇంటికి తీసుకెళ్ళి అతికించుకోండి అంటాడు రాజ్. నేను వెళ్ళిపోతాను బిడ్డని కట్టుబట్టలతో పంపించేసాను అందుకే తనకి బట్టలు తీసుకువచ్చాను అంటుంది కనకం. మా ఇంట్లో పండగలకు అబ్బాయిలకి అన్నదానం వస్తే దానం చేస్తాము కాబట్టి మీ అమ్మాయికి ఆ రెండిటి విషయాల్లోని లోటు లేదు అంటాడు రాజ్.

మీ ఆవేశంలో అర్థముంది మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే మాట్లాడుతారు మీరు సంస్కారవంతులు కాబట్టి నా ఇంట్లో ఉండవలసిన నా కూతురు మీ ఇంట్లో ఉంది. స్వప్న చేసిన మోసానికి కడుపులో పేగులు కదులుతున్నాయి. మీరు అంటారని  తెలుసు, నేను పడాలని తెలుసు. కానీ జరిగిన దాంట్లో మా కావ్య తప్ప ఏమీ లేదు అంటుంది కావ్య.

తప్పు ఆల్రెడీ ముసుగేసుకుని మా ఇంట్లోకి ప్రవేశించింది ఇంకా ఇంకొక తప్పు ఇంట్లోకి ప్రవేశిస్తే మేము ఎలా భరిస్తాము. ఆ పేదరికం విషయంలో మాకు ఏం పట్టింపు లేదు కానీ అబద్ధం చెప్పారే అదే దరిద్రం. మోసం చేశారు అది ఇంకా దరిద్రం. ఒక కూతురికి బదులు మరొక కూతురిని ముసుగేసి కూర్చోబెట్టారు కదా అది ఇంకా దౌర్భాగ్యం. ఎన్ని చేసి తలవంచుకొని నిలబడితే ఈ కుటుంబం క్షమిస్తుందని ఎలా అనుకున్నారు అంటుంది అపర్ణ.

అపర్ణని ఆగమని చెప్పి ఆడపిల్లల తల్లివి నువ్వు మా ఇంటికి వస్తే ఇలా మాట్లాడటం తప్పుగా అనిపించవచ్చు కానీ నువ్వు చేసింది తప్పు. పేదరికం తప్పు కాదు నేరము కాదు అది ఒకలాంటి దురదృష్టం అంతే నువ్వు నీ పరిస్థితిని నిజాయితీగా చెప్పి ఉంటే డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వని నా భర్త సంతోషంగా ఒప్పుకునేవారు. స్వప్న సంగతి వదిలేయ్ ఈ అమ్మాయిని చూడు ఎంత చూడముచ్చటగా ఉంది.

ఆత్మ అభిమానం తునికి సలాడుతుంది ఈ అమ్మాయిని చూపించి ఉంటే మేము లక్షణంగా చేసుకునే వాళ్ళం అంటుంది చిట్టి. జరిగిందాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్ దయచేసి నాలో సంస్కారం చచ్చిపోక ముందే ఆవిడని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి అంటుంది అపర్ణ. మీరు చేసిన తప్పు వల్ల ఎక్కడ మీ కూతురు శిక్ష అనుభవించక తప్పదు.

ఇక్కడ ఎవరు మీ అమ్మాయిని కోడలుగా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు అంటుంది రుద్రాణి. నా బిడ్డ మీద కోపాన్ని చూపించొద్దు కావాలంటే మీరందరూ నన్ను చెప్పుతో కొట్టండి అంటుంది కనకం. ఏం మాట్లాడుతున్నావమ్మ అంటుంది కావ్య. నేను చేసింది తప్పే కదా నీ తప్పులేదు కదా అంటుంది కనకం. అంటే తప్పు మాదా ఒక కూతురు పెళ్లి పీటల వరకు వచ్చి వెళ్ళిపోయింది.

మరో కూతురు ముసుగేసుకుని ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు మీరు వచ్చారు ఆ తర్వాత చుట్టాలు బంధువులు అందరూ రాకపోకలు ప్రారంభిస్తారు అంటాడు రాజ్. మీకు ఇష్టం లేకపోతే మేము ఎవరిని రావటం మానేస్తాను అంతేకానీ కావ్యని అపార్థం చేసుకోవద్దు పెళ్లి పీటలు మీరు కూర్చోమంటే తను కూర్చోవడానికి ఇష్టపడలేదు. వాళ్లని మోసం చేసినట్లుగా అవుతుంది అని చెప్పింది.

 కనీసం స్వప్న వచ్చేవరకు పీటల మీద కూర్చోమంటే కూర్చుంది అంటుంది కనకం. చేసింది చాలు మీరు వెళ్లిపోతే ప్రశాంతంగా ఉంటాం అంటుంది రుద్రాణి. మీరు ఏమన్నా పడతాను కానీ నా కూతురు తప్పు అస్సలు లేదు. వీటికి మంచి పేరు తీసుకు వస్తుంది మీ కుటుంబ గౌరవాన్ని నిలబడుతుంది మీ ఇంటి కోడలుగా ఒప్పుకోండి అంటూ అపర్ణ కాళ్లు పట్టుకుంటుంది కనకం.

 అందుకు కావ్య ఎంతో బాధపడుతుంది ఆమెని లేపి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఇక్కడ ఎలా మాట్లాడుతారో తెలీదా, ఆడపిల్ల తెలివైనందుకైనా ఆవిడ కాళ్లు పట్టుకోడానికి కూడా సిద్ధపడ్డావు అంటూ తల్లిని మందలిస్తుంది కావ్య. ఆడపిల్ల పుట్టిందని ఏ తల్లి బాధపడదు కూతురు కోసం, ఆమె భవిష్యత్తు కోసం చాలా కష్టపడుతుంది ఆడపిల్ల తల్లి అంటే ఈ సృష్టికే మూలం.

 అలాంటి నువ్వు ఒకరి కాళ్లు పట్టుకుంటే నేను చూస్తూ ఎలా ఉండగలను ఉంటుంది కావ్య. మా ఇంట్లో ఏడిస్తే మా సంస్కారం మీద మాకే నమ్మకం వస్తుంది ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా వచ్చారు. రాకపోయి ఉంటే ఎక్కడ బాధ అక్కడే ఉండేది మీ అమ్మని వెనకేసుకొస్తున్నావు నువ్వు మాత్రం చేసింది ఏంటి అంటూ కావ్యని అడుగుతాడు రాజ్. నేనేం చేశాను తాళి కట్టే సమయానికి కట్టకుండా ఆపాను.

 అదే నేను చేసిన తప్ప అక్క తిరిగి వస్తుందన్న ఆశతో పీటల మీద గుండెలు పగిలిపోతున్న ఓపిగ్గా ఒక శత్రువు పక్కన కూర్చున్నాను కదా, అదా నేను చేసిన తప్పు అంటూ నిలదీస్తుంది కావ్య. తాళి కడితేనే కానీ కదలనివ్వనని అందర్నీ రెచ్చగొట్టావు  మీడియా వాళ్ళని కూడా ఉసిగొలిపి మా పరువు పోయే స్టేజ్ లో నా చేత బలవంతంగా తాళి కట్టే లాగా చేశావు అంటాడు రాజ్. ఈ గొడవలన్నిటిలో మా అమ్మ తప్పేమీ లేదు.

 ఆమె ఆ సమయానికి స్పృహ తప్పి పడిపోయింది మేము మా అమ్మ చుట్టూనే ఉన్నాము. అయినా మాదే తప్పు అంటున్నారు, జరిగిందాంట్లో మీ తప్పు కూడా ఉంది అంటుంది కావ్య. మీరు నగల వ్యాపారం చేస్తారంట వజ్రాన్ని కంటితో చూసి అసలుతో నకిలీదో చెప్పేస్తారట అలాంటి తెలివితేటలు మీరు మా అక్క అందం చూసి ఇష్టపడ్డారా లేక తన అందమైన మనసును చూసి ఇష్టపడ్డారా.

 క్షణంలో నిర్ణయాలు తీసుకున్నారు, నాలుగు రోజుల్లోనే నిశ్చితార్థం వరకు తీసుకొచ్చారు అంటే మీకు కావలసింది అందం మాత్రమే మంచి చెడు కాదు అంటుంది కావ్య. మా అమ్మ చదివిన చందమామ కథల్లో రాజకుమారుడు వచ్చి సామానురాలిని పెళ్లి చేసుకున్నట్లు చదివింది తన బిడ్డల్ని కూడా అలాగే చూసుకోవాలి అనుకుంది కానీ మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి కలలు కనే హక్కు లేదని మా అమ్మ మర్చిపోయింది.

ఆ కలలని నిజం చేసుకునే పనిలో పడి ఈరోజు మీ అమ్మగారి కాళ్ళ మీద పడింది. ఒక దోషి లాగా తల దించుకొని నిలబడింది అంటుంది కావ్య. మీ చందమామ కథ చాలా అద్భుతంగా ఉంది ఇంకో చందమామ కథ రాసి పబ్లిష్ చేయించు అంటాడు రాజ్. నేను మీ స్వప్న అందం చూసి కాదు ఆమె మనసుని చూసి ప్రేమించాను అని కథలో మమ్మల్ని కదిలించవు, మీ అమ్మ చేసింది తప్పు కాదు నేరం.

ఇప్పుడు వదిలేస్తే మళ్లీ మళ్లీ మా ఇంటికి వచ్చి కుటుంబాన్ని ముక్కలు చేస్తారు ఇప్పుడే పోలీసులు పిలిచి మీ అమ్మని అరెస్టు చేయిస్తాను అంటూ ఫోన్ తీస్తాడు. వద్దు నాన్న తప్పు ఒప్పుకున్నారు కదా కావాలంటే మన ఇంటికి రావొద్దని చెబుదాం అంటుంది ధాన్యలక్ష్మి. ఆమె మాట వినకపోవడంతో చిట్టి, కళ్యాణ్ కూడా వచ్చి నచ్చ చెపుతారు. ఇంకొకసారి ఆ ఫ్యామిలీని సపోర్ట్ చేస్తే తమ్ముడవని కూడా చూడను అంటూ కళ్యాణ్ మీద కేకలు వేస్తాడు రాజ్.

ఇంకా గొడవలు పెద్దది చేస్తే మన ఇంటి పరువే పోతుంది అంటుంది చిట్టి. చేయనివ్వండి పోలీసులు రావాల్సిందే నేరం చేయవలసింది ఎవరో తెలియాల్సిందే అంటుంది కావ్య. తరువాయి భాగంలో నేను వచ్చి మీ ఇంట్లో గొడవలు పెట్టినట్లుగా అయింది నేను వెళ్లి వస్తాను అంటుంది కనకం. మంచిది ఇంకెప్పుడు రావద్దు అంటుంది కావ్య. ఇన్నాళ్లు మా అందరి కోసం కష్టపడ్డావు ఇప్పుడు నీకు ఆపురాన్ని నిలబెట్టుకోవటానికి కష్టపడి అంటూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది కనకం.

Follow Us:
Download App:
  • android
  • ios