Brahmamudi: స్టార్ మాలో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది. మంచి కుటుంబ కథ కావటంతో ప్రేక్షకులు బ్రహ్మ రథాన్ని పడుతున్నారు. ఇక ఈ రోజు మార్చి 7 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో ఈ కావ్య స్వప్న చెల్లెలా అంటూ ఆశ్చర్యపోతాడు రాజ్. అయితే మాత్రం స్వప్న స్థానంలో ఎందుకు కూర్చుంది అంటాడు. అప్పుడు జరిగిందంతా చెప్తుంది కనకం. స్వప్నకి నాతో పెళ్లి ఇష్టం లేదంటే నేను నమ్మను ఇది కూడా మీరు చెప్పే అబద్ధాల్లో ఒకటి. ఇక్కడిదాకా వచ్చినా పెళ్లిని తప్పించుకుని వెళ్ళిపోయిందా అంటాడు రాజ్.
దుగ్గిరాల కుటుంబానికి మంచి అందమైన సాంప్రదాయమైన అమ్మాయి కోడలుగా రాబోతుందని ఆనందపడ్డాము. ఎందుకిలా చేశారు మాకేం తక్కువ అంటాడు సీతారామయ్య. ఆ అవమానాలైనా భరించే వాళ్ళం కానీ ఈ మోసాన్ని భరించలేకపోతున్నాం అని సీతారామయ్య అంటాడు. ఇవే కాదు చాలా అబద్దాలాడాం. నా భార్య ఆడిన అబద్ధాలకి అంతే లేదు.
మీరందరూ అనుకున్నట్లు మేము ధనవంతులం కాదు మాకు ఆ షాప్ చెప్తే వేరే ఆదాయం లేదు. నా భార్య చెప్పే అబద్ధాలకి నాకు గాని నా కూతురు గాని ఎలాంటి సంబంధం లేదు అంటూ ఆవేశంగా మాట్లాడుతాడు. ఇతన్ని ఏమీ అడగవద్దు దాని దగ్గర ఎలాంటి జవాబు లేదు తప్పంతా నా భార్యదే అంటాడు కృష్ణమూర్తి. అవును తప్పంతా నాదే.
స్వప్న కోసం మీరు ఎదురు చూస్తుంటారు, ముహూర్తం సమయానికైనా స్వప్న తిరిగి వస్తుందని ఎదురు చూశాను. కానీ రాలేదు అంటుంది కనకం. ఏ మనిషివి నువ్వు ఇప్పటివరకు చెప్పిన అబద్ధాలు చాలక ఇప్పుడు ఏకంగా పెళ్లి కూతుర్నే మార్చేశావు అంటూ చివాట్లు పెడుతుంది ధనలక్ష్మి. వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక నా కొడుకుని పోగొట్టుకున్నాను.
నాలాంటి పరిస్థితి నా కూతుర్లకి రాకూడదని నేను ఈ పని చేశాను. నా కూతురు ఇంత పని చేస్తుంది అనుకోలేదు. ఇప్పుడు ఈ కూతురు కూడా మీరు నిందిస్తే నేను చచ్చిపోతాను అంటుంది కనకం. ఛీ ఏ మనుషులు మీరు, సంపాదన చాలక పోతే సర్దుకుపోవాలి కానీ నీ భార్య ఎన్ని వెధవ వేషాలు వేస్తుంటే చూస్తూ ఊరుకున్నావా, నువ్వు ఎంత చేతకాని వాడివి అంటూ కృష్ణమూర్తిని నిందిస్తారు సుభాష్, అతని తమ్ముడు.
మా నాన్నని ఏమీ అనొద్దు తను అసమర్థుడు కాదు అసహయుడు. మా అమ్మ అబద్ధాలు చెప్పిన మాట నిజమే కానీ మేము మోసగాళ్లం కాదు. అక్క తిరిగి వస్తుందని ఉద్దేశంతోనే నేను పీటల మీద కూర్చున్నాను అంతేకానీ వేరే ఉద్దేశం లేదు నిజంగా నేను అయితే తాళి కట్టించుకున్నాక నిజం బయట పెట్టేదాన్ని కదా అంటుంది కావ్య. జీలకర్ర బెల్లం కూడా పెట్టేశారు.
ఇప్పుడు పెళ్లి ఆగిపోతే నా కూతురు బ్రతుకు అన్యాయం అయిపోతుంది అంటూ కన్నీరు పెట్టుకుంటుంది కనకం. మరోవైపు రూంలో స్వప్నని దగ్గరికి తీసుకోబోతున్న రాహుల్తో ఇవన్నీ పెళ్లయిన తర్వాతే అంటుంది స్వప్న. నామీద నీకు ఇంకా నమ్మకం లేనట్లు ఉంది నీకోసం నేను నా కుటుంబానికి ద్రోహం చేశాను. నా ప్రాణ స్నేహితుడు రాజ్ ని కూడా పక్కన పెట్టేసాను.
అలాంటిది నీ ప్రేమ తగ్గితే నేను తట్టుకోలేను అంటాడు రాహుల్. ఈ ప్రపంచంలో నేను నిన్ను తప్పితే వేరెవరిని నమ్మను అంటుంది స్వప్న. అలా మాయమాటలతో తనని లోబరుచుకుంటాడు రాహుల్. అదే సమయంలో పక్క స్థానంలో ఇతనితో నన్ను ఎలాగా పెళ్లి చేసుకోమంటావు ఈ కాసేపటికే నాకు మోసం చేస్తున్నట్లుగా గిల్టీగా అనిపించింది. అలాంటిది జీవితాంతం భార్యగా ఎలా ఉంటాను అంటుంది కావ్య.
మీ కుటుంబం మొత్తానికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. నటనలో అందరూ పండిపోయారు. ముందు ఆస్తిపరులు అన్నారు తర్వాత ఇంకేమి అబద్ధాలు చెప్పారు అన్నిటినీ క్షమిస్తాను కానీ నా జీవితంలో ఉన్న ఒకే ఒక శత్రువు ఈమె తనని ఎలాగా పెళ్లి చేసుకుంటానని అనుకుంటారు అంటాడు రాజ్. నేను కూడా మిమ్మల్ని చేసుకోవటానికి సిద్ధంగా లేను అంటుంది కావ్య.
నువ్వు కాసేపు ఆగు అంటూ మీనాక్షి, బాబు ఇక్కడ పెళ్లి 90 వంతులు అయిపోయింది ఆ తల్లి తండ్రి కాళ్లు కడిగి కన్యాదానం కూడా చేశారు, సకల దేవతలను ఆహ్వానించి గౌరీ పూజ కూడా చేశారు ఇక మిగిలిపోయింది బ్రహ్మముడి మాత్రమే. ఇప్పుడు ఆ ఒక్కటి వేయకపోతే ఆమె బ్రతుకు అన్యాయమైపోతుంది అంటుంది. నీ మాటలు నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరు. ముందు ఒక కూతురు అని అబద్ధం చెప్పింది.
ఇప్పుడేమో రెండో కూతురినిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది ఈవిడ అసలు కళ్ళతల్లేనా ఈవిడ కూతుర్ని మేము కోడలుగా చేసుకోవాలా అంటూ కేకలు వేస్తుంది ధనలక్ష్మి. నేను చెడ్డ తల్లిని కావచ్చు కానీ నా కూతురు చాలా మంచిది తను ఎప్పుడూ తప్పు చేయదు అంటుంది కనకం. ఇప్పటివరకు చేసిన నిర్వాకం చాలు బలవంతంగా పెళ్లి చేసి దాని గొంతు కొయ్యకు ఉంటాడు కృష్ణమూర్తి.
నాకు కూడా ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటుంది కావ్య. మీరందరూ ఎలాగైనా కట్టకట్టుకు చావండి కానీ మీ పెళ్లి జరగడం అసంభవం అంటాడు రాజ్. నా ఫ్యామిలీ ని మోసం చేసినందుకు మీ అందరిని జైలుకు పంపించేదాకా వదలను అంటాడు రాజ్. ఇంతలోనే రాజ్ తల్లీ ఫోన్ చేయటంతో అసలే పుట్టెడు దుఃఖంలో ఉంది తనకి ఇలాంటివి చెప్పొద్దు అంటాడు సీతారామయ్య.
ఫోన్ లిఫ్ట్ చేసి ఈ సౌండ్ లో నాకేమీ వినిపించడం లేదు అని ఫోన్ పెట్టేస్తుంది ధనలక్ష్మి. నువ్వు వదినకి ఏమి తెలియకపోవటమే మంచిది లేకపోతే అందరినీ కట్టుకట్టుకొని ఇంటికి వెళ్లిపోమంటుంది అనుకుంటుంది రుద్రాణి. నేను ఈ మోసగితే మెడలో తాళికట్టను అంటూ స్టేజ్ దిగిపోతాడు రాజ్. ఇదే విషయం మీడియాలో కూడా వచ్చేస్తుంది. నేను చేసిన తప్పుకి నా కూతురికి శిక్ష వెయ్యొద్దు అంటూ అందరినీ కాళ్లు పట్టుకుంటుంది కనకం.
ఇంతలో కనకం గుండె పట్టుకొని పడిపోవటంతో అందరూ కంగారుగా ఆమె దగ్గరికి వెళతారు. ఇప్పుడు నాటకం మంచి రసపట్టులోకి వచ్చింది నీ తెలివికి హాట్సాఫ్ అనుకుంటుంది రుద్రాణి. ఏంటి చూస్తున్నారు అంబులెన్స్ కి ఫోన్ చేయండి అంటూ కంగారు పెడుతుంది రుద్రాణి. బయటికి వచ్చిన రాజ్ వీళ్ళందరూ పని చెప్తాను ఫ్యామిలీ మొత్తాన్ని జైలుకు పంపిస్తాను అనుకుంటాడు.
చేసిన డ్రామా చాలు అక్క బతుకుని బజారన పడేసావు లెగు అంటూ కోప్పడుతుంది అప్పు. అలా అనొద్దు అంటూ చెల్లిని వారిస్తుంది కావ్య. అంతలో అక్కడికి వచ్చిన డాక్టర్ ఆమెని చెక్ చేస్తాడు. తరువాయి భాగంలో నాకు అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటూ తండ్రికి చెప్తుంది కావ్య. పెళ్లి చేసుకోకుండా ఒక ఆడపిల్ల బ్రతకలేదా అంటూ కోపంగా అక్కడి నుంచి అంటూ ట్విస్ట్ ఇస్తాడు రాజ్.
