బాలీవుడ్ నటి రైమాసేన్ క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. వేధింపులకు గురికాకపోవడం నిజంగా నా  అదృష్టం అని ఆమె అన్నారు.రైమాసేన్ ప్రముఖ నటీమణులు కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. ప్రముఖ తారలు సుచిత్రసేన్ మనవరాలిగా, మున్ మూన్ సేన్ కూతురిగా అందరికి పరిచయమైంది. 


బాలీవుడ్ డైరీస్ చిత్రంలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. అయితే తన కెరీర్‌లో ఎవరి నుంచి లైంగిక వేధింపులకు గురికాలేదు అని రైమాసేన్ చెప్పింది.పడక గదిలో వెళ్లితేనే అవకాశాలు వస్తాయనే అంశంపై రైమాసేన్ స్పందించింది. ప్రతీ ఒక్కరి ప్రవర్తనపై ఈ అంశం ఆధారపడి ఉంటుంది. సక్సెస్ సాధించాలంటే దానికి షార్ట్‌కట్ ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సినిమా అవకాశం దక్కించుకోవాలంటే డైరెక్టర్‌తో పడుకోవాల్సిన అవసరం లేదు. అదీ ఎప్పటికీ వర్కవుట్ కాదు. సినీ పరిశ్రమలో సక్సెస్ కావాలంటే టాలెంట్ ప్రాధానం అని రైమాసేన్ అన్నారు.

ఎవరికైనా టాలెంట్ ఉందని భావిస్తే దానినే ఆధారం చేసుకోవాలి. టాలెంట్ లేనప్పుడే ఇలా దిగజారాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఎవరైనా తన మీద తనపై విశ్వాసం పెంచుకోవాలి అని రైమా చెప్పారు. లైంగిక వేధింపులనే విషయం అన్ని రంగాల్లో ఉంది. కేవలం సినీ పరిశ్రమకే పరిమతం కాదు. అలాంటి వేధింపులకు నేను గురికాకపోవడం నిజంగా అద‌ృష్టవంతురాలినే అని రైమా అభిప్రాయపడింది.