ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా కీ రోల్ పోషిస్తోంది. ఇక ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి అకౌంట్స్ లో సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఒక్కోసారి కొందరు ఆకతాయిలు చేసే కామెంట్లు కూడా తీవ్ర దుమారాన్ని రేపుతాయి.

తాజాగా నటి రాధికకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. కొన్నిరోజులుగా ఆమె బ్లడ్ క్యాన్సర్ తో బాధ పడుతుందని ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారనే మాటలు వినిపించాయి. ఆ కారణంగానే ఆమె బయట పెద్దగా కనిపించడం లేదనే పుకార్లు గుప్పుమన్నాయి.

తమిళనాట మొత్తం ఈ వార్త వ్యాపించింది. దీంతో ఓ అభిమాని ట్విట్టర్ ద్వారా రాధికాను దీని గురించి ప్రశ్నించగా.. దానికి ఆమె అందులో ఎలాంటి నిజం లేదని, అవన్నీ ఊహాగానాలు మాత్రమేనని తేల్చి చెప్పింది. హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో లెక్కలేనన్ని చిత్రాల్లో నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,  నిర్మాతగా తన సత్తా చాటుతోంది రాధికా శరత్ కుమార్.