కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన కథానాయికల జాబితాలో రాశి ఖన్నా కనిపిస్తుంది. సాధారణంగా ఒక హీరోయిన్ కి ఇతర హీరోయిన్లతో ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంటుంది. రాశి ఖన్నాకి మాత్రం హీరోలతో ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంటుందనే టాక్ వుంది. అదే విషయాన్ని 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆలీ ప్రస్తావించగా, రాశి ఖన్నా తనదైన శైలిలో స్పందించింది. తాను రకుల్ .. లావణ్య త్రిపాఠిలతో ఎక్కువ స్నేహంగా ఉంటానని చెప్పింది.

ఇక హీరోలతో ఫ్రెండ్షిప్ ఎక్కువనే మాట కూడా నిజమేనని అంది. అయితే వాళ్లందరితో పాటు నన్నెందుకు బర్త్ డే పార్టీకి పిలవలేదంటూ ఆలీ ఆటపట్టించాడు. 'ఒక మెగా హీరోతో లవ్ లో పడ్డావనే టాక్ కూడా ఇండస్ట్రీలో వుంది' అని ఆలీ అనడంతో, 'అయితే ఆ మెగా హీరో ఎవరో చెప్పండి' అంటూ రాశి ఖన్నా నవ్వేసింది. అదంతా కేవలం పుకారు మాత్రమేనని స్పష్టం చేసింది