పుష్ప 2 పోస్టర్ కొత్త రికార్డు నమోదు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 70 లక్షల లైక్‌లు పొందిన పోస్టర్‌గా ఇది నిలిచిందని మూవీ టీమ్ వెల్లడించింది. 

పుష్ప సినిమా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లింది. కొత్త మేనరిజాన్ని పరిచయం చేసింది. పుష్ప మేనరిజం, డైలాగులు దేశవ్యాప్తంగా హిట్ అయ్యాయి. దీంతో సహజంగానే పుష్ఫ సీక్వెల్ పుష్ప 2 చిత్రంపై ఆసక్తి ఏర్పడ్డది. ఇటీవలే పుష్ప టీమ్ పుష్ప 2 పోస్టర్ విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న ఆసక్తి, ఆదరణకు తోడు సీక్వెల్ పోస్టర్ కూడా జబర్దస్త్‌గా ఉండటంతో అభిమానులకు కన్నుల పండుగైంది. అంతేనా.. సినిమానే కాదు.. ఈ పోస్టర్ కూడా పాన్ ఇండియా స్థాయిలో రికార్డు సృష్టించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియన్ల లైకులు ఈ పోస్టర్ సాధించి రికార్డు బద్ధలు కొట్టింది. ఇది వరకు ఏ సినిమా పోస్టర్‌కూ అన్నేసి లైక్‌లు రాలేవు. దీంతో దీనికిదిగా ఒక కొత్త రికార్డ్‌గా ఉన్నది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ సోషల్ మీడియాలో స్వయంగా ప్రకటించింది. పుష్ప దేశవ్యాప్తంగా రూల్ చేస్తున్నాడని, పుష్ప 2 ది రూల్ పోస్టర్ దేశవ్యాప్తంగా సంచలనమైందని పేర్కొంది. పుష్పనేకాదు.. పుష్ప పోస్టర్ కూడా తగ్గేదేల్యా అంటూ రికార్డ్ నమోదు చేసింది.

అల్లు అర్జున్‌ను ఊహించని గెటప్‌లో ఈ పోస్టర్ చూపించింది. చీర కట్టు, చేతులకు గాజులు, ఒంటి నిండా ఆభరణాలు, మెడలో పూసలు, నిమ్మకాయల దండతో శక్తి స్వరూపిణి రూపంలో అల్లు అర్జున్ కనిపించారు. ఇలాంటి లుక్ ఇది వరకెప్పుడూ చూడలేదు. దీంతో పోస్టర్‌కు విశేష ఆదరణ లభించింది. సోషల్ మీడియాలో ఇదెంత వైరలో చెప్పక్కర్లేదు. అందుకే ఈ పోస్టర్ ఆల్ ఇండియా రికార్డ్ సృష్టించింది. తిరుపతిలోని గంగమ్మ జాతరలో మగవారు మహిళల తరహా మేకప్ చేసుకుంటారనే వార్తలు ఈ పోస్టర్ విడుదలైనప్పుడు వచ్చాయి. అయితే.. ఈ గంగమ్మ జాతర విశేషాలు బయటికి పెద్దగా తెలియవు.

Also Read: సూపర్ స్టైలిష్ లుక్ లో అల్లు అర్జున్, ట్రావెల్ లీజర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఐకాన్ స్టార్..

Scroll to load tweet…

పోస్టర్ కూడా ఇలాంటి రికార్డు నమోదు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. పుష్పకు ఉన్న క్రేజ్‌కు పోస్టర్ నిదర్శనం. పుష్ప పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. దీంతో చాలా భాషల ప్రజలకు సినిమా చేరువైంది. అందుకే పుష్పకు అభిమానులు పెరిగిపోయారు. పుష్ప 2 లుక్ అందుకే పాపులర్ అయింది.