- Home
- Entertainment
- సూపర్ స్టైలిష్ లుక్ లో అల్లు అర్జున్, ట్రావెల్ లీజర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఐకాన్ స్టార్..
సూపర్ స్టైలిష్ లుక్ లో అల్లు అర్జున్, ట్రావెల్ లీజర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఐకాన్ స్టార్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ తో పాటు.. పాన్ ఇండియా లెవల్లో ఇమేజ్ తో పాటు.. సూపర్ స్టైలిష్ స్టార్‌గా దూసుకుపోతున్నాడు. దేశవ్యాప్తంగా హిట్‌లు అందించిన అతికొద్ది మంది నటుల్లో ఆయన కూడా ఒకరు. మాస్ హీరో తన స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు.. స్టైలీష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నాడు.
పుష్ప: ది రైజ్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ను చెడుగుడు ఆడేసుకున్నాడు అల్లు అర్జున్. హిందీలో ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి.. అక్కడే 100కోట్లకు పైగా వసూళ్లు సాధించింది మూవీ. దాంతో అల్లు అర్జున్ ఇమేజ్ దేశవ్యాప్తంగా పెరిగింది. ఆయన ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది. అంతే కాదు.. బన్నీ స్టైలీష్ లుక్స్ కు పడిచచ్చిపోతున్నారు ఫ్యాన్స్.
బన్నీ తన అల్ట్రా స్టైలీష్ లుక్స్ తో.. అందరికీ హాట్ ఫేవరెట్ అయ్యాడు. సిల్వర్ స్క్రీన్ మీద డిఫరెంట్ గెటప్స్ లో కనిపించే అల్లు అర్జున్.. అటు కొన్ని ఫ్యాషన్ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉంటూ..ఇంకాస్త కొత్తగా కనిపిస్తున్నాడు. నలబై ఏళ్ల వయస్సులో కూడా అల్లు అర్జున్ కుర్ర హీరోలను మించిన హ్యాండ్సమ్ లుక్ తో మనసుదోచేస్తున్నాడు.
ఇప్పటికే బన్నీ చాలా బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉన్నాడు. ఎన్నో ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నాడు. ఇదులో కొన్ని ఫ్యాషన్ బ్రాండ్స్ కూడా ఉండగా..తాజాగా అల్లు అర్జున్.. మరో ఫ్యాషన్ ఉత్పత్తుల సంస్థకు అంబాసిడర్ గా సైన్ చేశాడు. ట్రావెల్ + లీజర్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ.. బన్నీ ఒక ప్రత్యేక కవర్ ఫోటోషూట్ ను చేశాడు.
ట్రావెల్+లీజర్ ఇండియా & సౌత్ ఏషియాలో ప్రముఖ పట్టణాలకువిస్తురిస్తున్న సంస్థ. ఈ సంస్థ తమ ప్రాడక్ట్స్ కు ప్రతినధిగా అల్లు అర్జున్ ను ప్రకటించడంతో పాటు.. బన్నీకి సబంధించిన అత్యంత అద్భుతమైన స్టైలిష్ ఫోటోలను రిలీజ్ చేశారు. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోస్ లో అల్లు అర్జున్ అద్భుతంగా కనిపించాడు. లాంగ్ కర్లీ హెయిర్ తో.. జిల్ జిగేలుమనిపించే డ్రస్సుల్లో.. బన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫోజులిచ్చాడు. ఫ్యాషన ప్రపంచంలో.. ఎప్పుడూ ఒకే రకంగా ఉంటే నడవదు.. ఆ విషయాన్ని బన్నీ ఆచరణలో చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో రకాలుగా కనిపించాడు. అంతే కాదు ఆయన సినిమా సినిమాకు లుక్ ను మార్చేస్తాడు.. ఫ్యాన్స్ కు సరికొత్త అనుభూతిని ఇస్తుంటాడు.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రైజ్‌కి సీక్వెల్ అయిన పుష్ప 2 ది రూల్‌తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. ఈమూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పుష్పతో తన కు వచ్చిన క్రేజ్ కు మించిన క్రేజ్ ను ఈసినిమాతో సాధించాలని చూస్తున్నాడు బన్నీ. ఈక్రమంలో దేశవ్యాప్తంగా బన్నీ ఫ్యాన్స్ ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.