మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లోని మెగా 157 చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఈ చిత్రం నుంచి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వైరల్ గా మారింది. 

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లోని మెగా 157 చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించనుండటం మరో ప్రత్యేక ఆకర్షణ. ఇదివరకే వీరిద్దరూ సైరా, గాడ్ ఫాదర్ చిత్రాల్లో కలసి నటించారు. చిరు, నయనతార కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ గా నబా కాంత మైతే మెగా 157 సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 

పుష్ప 2 యాక్షన్ కొరియోగ్రాఫర్ ఎంట్రీ

చిరంజీవిపై నబా కాంత మైతే, అనిల్ రావిపూడి క్రేజీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశారట. నబా కాంత మైతే రామ్ చరణ్, బుచిబాబు కాంబినేషన్‌లో వస్తున్న పెద్ది చిత్రానికి వర్క్ చేస్తున్నారు. అంతకుముందు పుష్ప 2 లో క్లైమాక్స్, జాతర సన్నివేశాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేసి ప్రశంసలు పొందారు. చిరంజీవి నటించిన ఆచార్య, వాల్తేరు వీరయ్య చిత్రాల్లోనూ ఆయన పని చేశారు. ఈ నేపథ్యంలో మెగా 157లో ఫైట్స్ విషయంలో భారీ అంచనాలు మొదలయ్యాయి.

చిరంజీవి కామెడీ టైమింగ్

ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి నిర్మిస్తున్నారు. చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. మెగా 157 చిత్రాన్ని 2026 సంక్రాంతికి థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రంలో అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ ని హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.