MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • డిప్యూటీ సీఎంనే ఇరిటేట్ చేశాం.. పవన్ కళ్యాణ్ ప్రకటన, థియేటర్ల వివాదంపై బన్నీ వాసు కామెంట్స్

డిప్యూటీ సీఎంనే ఇరిటేట్ చేశాం.. పవన్ కళ్యాణ్ ప్రకటన, థియేటర్ల వివాదంపై బన్నీ వాసు కామెంట్స్

టాలీవుడ్ లో థియేటర్ల బంద్ వ్యవహారం పెద్ద సమస్యగా మారుతోంది. పవన్ కళ్యాణ్ సీరియస్ కావడం ఆ తర్వాత కొందరు నిర్మాతలు రియాక్ట్ అవుతుండడంతో ఇండస్ట్రీలో పరిస్థితులపై ఉత్కంఠ నెలకొంది. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : May 25 2025, 02:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
థియేటర్ల బంద్ వివాదం
Image Credit : Asianet News

థియేటర్ల బంద్ వివాదం

టాలీవుడ్ లో థియేటర్ల బంద్ వివాదం ముదురుతోంది. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల స్ట్రైక్ చేయబోతున్నట్లు ఇప్పటికే ఎగ్జిబిటర్లు ప్రకటించారు. దీంతో టాలీవుడ్ లో కొందరు నిర్మాతలు చొరవ తీసుకొని ఎగ్జిబిటర్ల సమస్యలు పరిష్కరించేందుకు పలుమార్లు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఫిలిం ఛాంబర్ క్లారిటీ
Image Credit : Asianet News

ఫిలిం ఛాంబర్ క్లారిటీ

అయితే థియేటర్ల బంద్ అనేది కేవలం ఊహాగానాలు మాత్రమే అని, జూన్ 1న థియేటర్ల బంద్ ఉండడం లేదని తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. తెలుగు ఫిలిం ఛాంబర్ లో సమావేశమైన నిర్మాతలు శనివారం రోజు ఈ ప్రకటన చేశారు. సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకుంటామని, అవసరమైతే ప్రభుత్వాలతో చర్చిస్తామని తెలిపారు. కానీ థియేటర్ల బంద్ అంటూ మీడియాలో వస్తున్న వార్తలు మొత్తం ఊహాగానాలేనని ఫిలిం ఛాంబర్ పేర్కొంది.

36
హరిహర వీరమల్లు రిలీజ్ కి ముందు ఇలా..
Image Credit : our own

హరిహర వీరమల్లు రిలీజ్ కి ముందు ఇలా..

జూన్ 12న ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుంది. సరిగ్గా పవన్ సినిమా రిలీజ్ అవుతున్న టైంలో థియేటర్ల బంద్ వ్యవహారం తెరపైకి రావడంతో ఫ్యాన్స్ దీనిని కుట్రగా భావిస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు పవన్ సన్నిహితులు కూడా దీని వెనుక కుట్ర దాగి ఉందని అంటున్నారు. అనవసరంగా థియేటర్ల సమస్య సృష్టించి పవన్ చిత్రాన్ని అడ్డుకోవాలని కొందరు కుట్ర చేస్తున్నారు అంటూ ట్రోలింగ్ జరుగుతుంది.

46
పవన్ కళ్యాణ్ సీరియస్
Image Credit : X/janasenaparty

పవన్ కళ్యాణ్ సీరియస్

ఈ వ్యవహారంపై స్వయంగా పవన్ కళ్యాణ్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చిత్ర పరిశ్రమని ఎలాంటి ఇబ్బందులకు గురిచేసిందో మరిచిపోయారా అంటూ పవన్ ఓ ప్రకటనలో ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వం చిత్ర పరిశ్రమ సమస్యల్ని పరిష్కరించేందుకు చొరవ చూపిస్తుంటే ఇలాంటి అనవసర సమస్యలు ఎందుకు సృష్టిస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

56
డిప్యూటీ సీఎంనే ఇరిటేట్ చేస్తున్నాం
Image Credit : our own

డిప్యూటీ సీఎంనే ఇరిటేట్ చేస్తున్నాం

పవన్ కళ్యాణ్ ప్రకటనపై టాలీవుడ్ నిర్మాతలు స్పందిస్తున్నారు. తాజాగా బన్నీ వాసు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. 'సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్ గా ఉంటాయి.. అలాగే చాలా లోతుగానూ ఉంటాయి. ఈ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతుంది అనేది ఇప్పటికైనా సరే.. ప్రొడ్యూసర్స్ గానీ.. డిస్ట్రిబ్యూటర్స్ కానీ.. ఎగ్జిబిటర్స్ కానీ గ్రహించాలి. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఒకరు డిప్యూటీ సీఎం అయిన వాళ్ళనే మనం ఇరిటేట్ చేసామంటే.. మన యూనిటీ ఎలా ఉంది అని ప్రశ్నించుకునే సమయం వచ్చింది' అని బన్నీ వాసు ట్వీట్ చేశారు.

66
అనవసర సమస్య పెద్దదిగా మారింది
Image Credit : our own

అనవసర సమస్య పెద్దదిగా మారింది

సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాత నాగ వంశీ కూడా స్పందించారు. కీలకమైన సమస్యలు పరిష్కరించాల్సిన సమయంలో అనవసరంగా కొత్త సమస్యలు సృష్టించారు. ఇప్పుడు అవే పెద్ద సమస్యలుగా మారాయి. కామన్ సెన్స్ తో ఆలోచించి ఉంటే ఎలాంటి సమస్య వచ్చి ఉండేది కాదు అని నాగ వంశీ ట్వీట్ చేశారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 రెండో వారం ఎలిమినేషన్‌.. కృష్ణుడు ఔట్‌ ?
Recommended image2
Soundarya: సౌందర్య చనిపోయిందని నమ్మలేక రెండేళ్లపాటు అభిమానులు చేసిన పని ఇదే.. అమ్మ బయటపెట్టిన నిజం
Recommended image3
Anti Hero Roles: ఒకే సినిమాలో హీరో అండ్ విలన్.. ప్రభాస్ నుంచి సూర్య వరకు, ఇలా నటించడం వీళ్ళకే సాధ్యం
Related Stories
Recommended image1
Miss World 2025: వేశ్యలా ఫీలయ్యేలా చేశారు, మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకున్న మిల్లా మాగీ తీవ్ర ఆరోపణలు
Recommended image2
బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ అసభ్యకర మార్ఫింగ్ వీడియో వైరల్, పోలీసులకు ఫిర్యాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved