MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • వరుస డిజాస్టర్లతో నా పనైపోయింది, చిరంజీవి సరస్వతి దేవి మీద ఒట్టేశారు.. తండ్రీ కొడుకులపై డైరెక్టర్ కామెంట్స్

వరుస డిజాస్టర్లతో నా పనైపోయింది, చిరంజీవి సరస్వతి దేవి మీద ఒట్టేశారు.. తండ్రీ కొడుకులపై డైరెక్టర్ కామెంట్స్

మెగాస్టర్ చిరంజీవి సరస్వతి దేవి మీద ఒట్టేసి మరీ ఒక క్రేజీ డైరెక్టర్ కి మాట ఇచ్చారట. ఆ డైరెక్టర్ ఎవరు ? అసలేం జరిగింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

3 Min read
Author : Tirumala Dornala
| Updated : May 25 2025, 11:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
చిరంజీవి ప్రోత్సాహం
Image Credit : Asianet News

చిరంజీవి ప్రోత్సాహం

మెగాస్టార్ చిరంజీవి చాలామంది నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులను ప్రోత్సాహించిన సందర్భాలు ఉన్నాయి. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం మాత్రమే కాదు అవసరమైన వారికి చిరంజీవి సలహాలు కూడా ఇస్తుంటారు. టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా కృష్ణవంశీకి పేరు ఉంది. తన కెరీర్ ఇక ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో చిరంజీవి తనని ప్రోత్సాహించారని కృష్ణవంశీ పేర్కొన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
గోవిందుడు అందరివాడేలే మూవీ
Image Credit : our own

గోవిందుడు అందరివాడేలే మూవీ

చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరితో తనకి మంచి అనుబంధం ఉందని కృష్ణవంశీ పేర్కొన్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ గోవిందుడు అందరివాడేలే అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ గొప్పగా ఆడలేదు కానీ యావరేజ్ గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడం నిరాశ కలిగించింది అని కృష్ణవంశీ అన్నారు.

Related Articles

Related image1
హీరో కార్తి ఆస్తులు, ఫ్యామిలీ గురించి ఈ విషయాలు తెలుసా.. క్రేజ్ లో అన్నయ్యకి తీసిపోడు
Related image2
Miss World 2025: టాప్ మోడల్ ఛాలెంజ్ విజేతలు వీళ్ళే..గ్రాండ్ ఫినాలేకి దూసుకుపోయిన నందిని గుప్తా
37
వరుస డిజాస్టర్లు
Image Credit : our own

వరుస డిజాస్టర్లు

అసలు ఆ చిత్రం ఎలా మొదలైందో వివరిస్తూ చిరంజీవి, రామ్ చరణ్ తో తనకి ఎదురైన అనుభవాన్ని కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. గోవిందుడు అందరివాడేలే చిత్రానికి ముందు నా నుంచి దారుణమైన డిజాస్టర్ చిత్రాలు పడ్డాయి. ఒకటి గోపీచంద్ తో రూపొందించిన మొగుడు చిత్రం కాగా మరొకటి నానితో తెరకెక్కించిన పైసా మూవీ. ఈ రెండు చిత్రాల చిత్రీకరణ సమయంలో చాలా ఆలస్యం అయింది. దీనికి తోడు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను.

47
రమ్యకృష్ణ డేట్లు చూసుకుందామా ?
Image Credit : google

రమ్యకృష్ణ డేట్లు చూసుకుందామా ?

ఆ రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాక డిప్రెషన్ లోకి వెళ్ళాను. ఇక నా పని అయిపోయింది.. ఇంతటితో సినిమాలు మానేయాల్సిందేనా అనే డౌట్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఏం చేద్దాం.. వెళ్లి రమ్యకృష్ణ డేట్లు చూసుకుందామా అనే ఆలోచనలో పడ్డట్లు కృష్ణవంశీ తెలిపారు. తెలిసిన హీరోలని సినిమాల కోసం అడుగుతుంటే ఏదో ఒక కారణం చెప్పి రిజెక్ట్ చేయడం ప్రారంభించారు. నా కెరీర్లో చాలామంది దగ్గర మోసపోయాను. చివరికి కూతురు మీద ఒట్టేసి కోట్లు మింగేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాటిని కూడా తట్టుకున్నాను.

57
రాంచరణ్ తో ఫ్యామిలీ స్టోరీ
Image Credit : our own

రాంచరణ్ తో ఫ్యామిలీ స్టోరీ

కానీ ఒక దర్శకుడిగా హీరోలు నన్ను రిజెక్ట్ చేయడం చాలా బాధించింది. ఇక ఇప్పుడేం చేయాలి అని అనుకుంటున్న తరుణంలో నాకు గుర్తొచ్చింది మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య. కొన్నేళ్ల క్రితం చిరంజీవి గారిని కలిసినప్పుడు వీలైతే రామ్ చరణ్ తో కుటుంబ కథా చిత్రం చేయి. నువ్వు ఫ్యామిలీ స్టోరీలు బాగా తీస్తావు అని చెప్పారు. ఆ మాట గుర్తొచ్చి ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా. రామ్ చరణ్ కి కబురు పెట్టి పంపించా. నాకైతే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని హోప్ లేదు. అప్పటికే చాలా మంది హీరోలు రిజెక్ట్ చేశారు. చరణ్ కూడా రిజెక్ట్ చేస్తాడేమో అని అనుకున్నా.

67
జ్వరంతో బాధపడుతూ..
Image Credit : our own

జ్వరంతో బాధపడుతూ..

కానీ వెంటనే చరణ్ నుంచి రిప్లై వచ్చింది. తాను అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ లో ఉన్నానని వీలైతే కలవమని చెప్పి పంపించాడు. వెంటనే వెళ్లాను. ఆ టైంలో చరణ్ జ్వరంతో బాధపడుతూ వర్షానికి సంబంధించిన సీన్లలో నటిస్తున్నాడు. అయినప్పటికీ నాకోసం టైం కేటాయించాడు. నాతో సినిమా చేయడం నీకు ఓకేనా అని అడిగా. అదేంటి సార్ అలా అంటారు కథ ఉంటే చెప్పండి అని అడిగాడు. 20 నిమిషాల పాటు కథ చెప్పా. ఈ కథలో కొన్ని మూమెంట్స్ చాలా బాగున్నాయి సార్ నాకు నచ్చింది అని చెప్పాడు. మరి అప్పా (చిరంజీవిని చరణ్ అప్పా అని పిలిస్తారట) కి ఎప్పుడు కథ చెబుతున్నారు అని అడిగాడు.

77
సరస్వతి దేవి మీద ఒట్టేసి మాట ఇచ్చిన చిరు
Image Credit : Ram Charan, Krishna Vamsi

సరస్వతి దేవి మీద ఒట్టేసి మాట ఇచ్చిన చిరు

ఆ టైంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ రెండు రోజుల్లోనే తనను కలిసేందుకు టైం ఇచ్చారు. వెళ్లి కూర్చోగానే చిరంజీవి గారు ఒక మాట అన్నారు. నువ్వేం చెప్పావో వాడేం విన్నాడో నాకు తెలియదు. పక్కనే న్యూస్ పేపర్ ఉంది. దాని మీద చేయి వేసి సరస్వతి దేవి మీద ఒట్టేసి చెబుతున్నా నువ్వు చరణ్ తో సినిమా చేస్తున్నావ్ అని మాట ఇచ్చారు. కథ వినకుండానే ఆయన ఆ మాట చెప్పడం గొప్ప విషయం. ఆ విధంగా గోవిందుడు అందరివాడేలే చిత్రం ప్రారంభమైంది అని కృష్ణవంశీ అన్నారు. అంత గొప్ప అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయాను అనే గిల్టీ ఫీలింగ్ తనకు ఎప్పటికీ ఉంటుంది అని కృష్ణవంశీ తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
రామ్ చరణ్ కొణిదెల

Latest Videos
Recommended Stories
Recommended image1
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image2
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image3
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Related Stories
Recommended image1
హీరో కార్తి ఆస్తులు, ఫ్యామిలీ గురించి ఈ విషయాలు తెలుసా.. క్రేజ్ లో అన్నయ్యకి తీసిపోడు
Recommended image2
Miss World 2025: టాప్ మోడల్ ఛాలెంజ్ విజేతలు వీళ్ళే..గ్రాండ్ ఫినాలేకి దూసుకుపోయిన నందిని గుప్తా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved