తండ్రీకొడుకులను డైరెక్ట్ చేయబోతున్నాడా..?

puri jagannath to direct akkineni nagarjuna
Highlights

నాగార్జున హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ గతంలో 'శివమణి','సూపర్' వంటి చిత్రాలను 

నాగార్జున హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ గతంలో 'శివమణి','సూపర్' వంటి చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పుడు మరోసారి నాగ్ తో సినిమా చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ మరో విశేషమేమిటంటే ఈ సినిమాలో నాగచైతన్య కూడా కనిపిస్తాడట. 'మెహబూబా' సినిమా రిలీజ్ కు ముందే నాగ్ ను కలిసి కథ వినిపించాడట పూరి. కథలో ఉన్న ఎమోషన్ నాగార్జునకు నచ్చడంతో పూరిపై నమ్మకంతో సినిమా చేయాలనుకుంటున్నాడని సమాచారం.

ప్రస్తుతానికి నాగ్.. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నానితో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. అది పూర్తయిన తరువాత దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో 'బంగార్రాజు' సినిమా ఉండే ఛాన్స్ ఉంది. ఈలోగా పూరి తన కొడుకు ఆకాష్ హీరోగా మరో సినిమా పూర్తి చేసి వచ్చే ఏడాది ఆరంభంలో నాగార్జున,చైతులతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

నాగార్జున పాత్రకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ.. చైతుని కీలకపాత్రలో చూపించబోతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సివుంది! 

loader