పూరి పంచ్ మాత్రం మిస్ అవ్వలేదే!

First Published 15, May 2018, 3:25 PM IST
puri jagannath punch dialogue in mehbooba success celebrations
Highlights

దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాలకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉండేవారు. ఆయన సినిమా

దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాలకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉండేవారు. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే ఇక రిపీటెడ్ గా థియేటర్ లో సినిమా చూస్తూనే ఉంటారు. ఆయన ఫ్లాప్ సినిమాలలో కూడా చెప్పుకోదగ్గ హైలైట్స్ ఉండేవి. ఏ సినిమా తీసినా అందులో పూరి మార్క్ కొట్టొచ్చినట్లుగా కనిపించేది. కానీ రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన 'మెహబూబా'కు మాత్రం ఆశించిన స్పందన రాలేదు. కానీ చిత్రబృందం మాత్రం ఈ సినిమా హిట్ అనే ప్రచారం చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించింది చిత్రబృందం. ఇందులో పూరి విమర్శకులను ఉద్దేశించి కొన్ని కామెంట్లు చేయడం చర్చకు దారితీసింది. ''కమర్షియల్ ఫైట్లు, ఐటెం సాంగ్స్ తో సినిమాలు తీస్తుంటే పూరి తీసిన సినిమానే మళ్ళీ తీశాడంటారు. కొత్తగా సినిమా తీయలేడా అని ప్రశ్నిస్తారు. అలా అని కొత్తగా ప్రయత్నిస్తే అందులో పూరి మార్క్ మిస్ అయిందంటూ కంప్లైంట్ చేస్తున్నారు'' అంటూ ఈరోజు జరిగిన 'మెహబూబా' సినిమా సక్సెస్ మీట్ లో వెల్లడించారు పూరి జగన్నాథ్.

నిజానికి పూరి అనుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. 

loader