నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం రూలర్. కేఎస్ రవికుమార్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్ 20న రిలీజ్ కానున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ ఇటీవలే విడుదల కాగా అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. 

ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా సోనాల్ చౌహన్, వేదిక నటిస్తున్నారు. ఇదిలా ఉండగా రూలర్ విడుదల కాగానే బాలయ్య బోయపాటి దర్శత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇప్పటికే బోయపాటి దర్శత్వంలో వచ్చిన సింహా, లెజెండ్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. 

ఆ రెండు చిత్రాలని మించేలా మూడో చిత్రం ఉండాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ఇప్పటికే బోయపాటి పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేశారు. ఆ స్క్రిప్ట్ కు సరిపడే నటీనటుల అన్వేషణలో బోయపాటి బిజీగా ఉన్నారు. 

ఈ చిత్రం గురించి తాజాగా ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం బోయపాటి వైసిపి ఎమ్మెల్యే, నటి రోజాని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రోజా ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ విలన్ లక్షణాలతో నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం లేదు కానీ ఆ మేరకు బోయపాటి సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. 

ఇదే కనుక నిజమైతే సినిమాపై ప్రారంభానికి ముందే అంచనాలు పెరిగిపోవడం ఖాయం. ప్రస్తుతం బాలకృష్ణ టిడిపిలో ఎమ్మెల్యేగా, రోజా వైసిపి ఎమ్మెల్యేగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. కానీ వెండితెరపై మాత్రం వీరిద్దరిది తిరుగులేని కాంబినేషన్. రోజా, బాలయ్య కాంబినేషన్ లో భైరవద్వీపం, బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. 

ఈ మూవీలో మెయిన్ విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పేరు వినిపిస్తోంది. కన్నడ బ్యూటీ రచిత రామ్ హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.