Asianet News TeluguAsianet News Telugu

పూరీ విచారణకు సహకరించాడు, క్లూస్ ఇచ్చాడు- అకున్ సబర్వాల్

  • ముగిసిన దర్శకుడు పూరీ జగన్నాథ్ విచారణ
  • సిట్ విచారణలో మరిన్ని విషయాలు వెల్లడించారన్న అకున్
  • రేపు శ్యామ్ కె నాయుడు విచారణ జజరుగుతుందన్న ఎక్సైజ్ డైరెక్టర్
puri jagan cooperated for investigation says akun sabharwal

డ్రగ్స్ స్కామ్ లో సిట్ విచారణకు హాజరైన టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ను సిట్ అధికారులు దాదాపు 10 గంటలకు పైగా విచారించారు. ఉదయం 10.30కు సిట్ కార్యాలయానికి చేరుకున్న పూరీ.. రాత్రి 9.30కు కార్యాలయం నుంచి బయటికొచ్చారు.

ఈ విచారణలో పూరీ పూర్తిగా సహకరించారని, మరింత సమాచారం కూడా అందజేశారని అకున్ సభర్వాల్ వెల్లడించారు. రేపు శ్యామ్ కె నాయుడు  విచారణ జరుగుతుందని అకున్ సభర్వాల్ వెల్లడించారు.

ఇక టాలీవుడ్ కు చెందిన ఒక్కొక్కరిని ఒక్కో రోజు వరుసగా విచారించేందుకు సిట్ రంగం సిద్ధం చేసింది. మరోవైపు పూరీ విచారణ చాలా స్నేహపూర్వకంగా జరిగిందని అకున్ వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios