చిరు కూడా కథ బాగుందని చెప్పాడని టాక్. దేశభక్తి కథతో వస్తున్న ఈ సబ్జెక్ట్ అసలైతే మహేష్ కోసం రాసుకున్నాడు పూరి. కాని మహేష్ కమిట్ అయిన సినిమాల లిస్ట్ పెద్దదిగా ఉంది కాబట్టి అంతదాకా వెయిట్ చేయలేని పూరి వెంకటేష్ కు ఈ కథ వినిపించాడట. కాని బడ్జెట్ ఎక్కువ అవుతుందని భావించి సినిమా క్యాన్సిల్ చేసుకున్నాడు.

అదే కథ మీద ఇప్పుడు మెగాస్టార్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. పూరి చెప్పిన ఆటో జానిని పక్కన పెట్టేసి తన ఇమేజ్ కు తగ్గట్టుగా జనగణమనని తయారు చేయమని చెప్పాడట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కాని ఫ్లాపులతో సతమతమవుతున్న పూరికి ఈ ఆఫర్ నిజంగా లక్కీ ఛాన్స్ అన్నట్టే లెక్క. ఈ ప్రాజెక్ట్ గురించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. 

పూరి జ‌గ‌న్నాథ్ .... చాలా రోజులుగా మెగా ఆఫ‌ర్ కోసం వెయిట్ చేస్తున్నాడు అయితే తాజాగా త‌న దగ్గరున్న జనగణమన స్క్రిప్ట్ చిరంజీవికి వినిపించాడట .ఖైది నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి అసలైతే 150వ సినిమాగా పూరి దర్శకత్వంలో ఆటో జాని సినిమా చేయాలి.. మొదటి భాగం అదరగొట్టిన పూరి సెకండ్ హాఫ్ బాగా నేరేట్ చేయలేదని ఆ సినిమా ఆపేశారు.