Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 5: మానస్‌కి ధైర్యం లేదట.. బయటకు పంపిస్తే గేమెలా ఆడాలంటూ షణ్ముఖ్‌కి షాకిచ్చిన ప్రియాంక

మొదట సన్నీ-మానస్‌లు డిస్కషన్‌ చేసుకున్నారు. గత టాస్క్ ల విషయంలో జెస్సీ గురించి మాట్లాడుకున్నారు. అలాగే షణ్ముఖ్‌, సిరిలు కూడా వాళ్ల గురించి మాట్లాడుకున్నారు. ఇంతలో నామనేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. 
 

ravi setires on manas priyanka shock to shanmukh at bigg boss telugu 5
Author
Hyderabad, First Published Nov 1, 2021, 11:49 PM IST

బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu 5).. 58ఎపిసోడ్‌(57వ రోజు) నామినేషన్‌ హాట్‌ హాట్‌ గా సాగింది. సోమవారం అంటే నామినేషన్‌ డే అనే విషయం తెలిసిందే. ఈరోజు కూడా ప్రధానంగా నామినేషన్ల చుట్టూనే సాగింది. వాదోపవాదనలు ఆసక్తికరంగా, కామెడీగా సాగాయి. మొదట సన్నీ-మానస్‌లు డిస్కషన్‌ చేసుకున్నారు. గత టాస్క్ ల విషయంలో జెస్సీ గురించి మాట్లాడుకున్నారు. అలాగే షణ్ముఖ్‌, సిరిలు కూడా వాళ్ల గురించి మాట్లాడుకున్నారు. ఇంతలో నామనేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. 

మొదటగా మానస్‌ నామినేషన్‌ స్టార్ట్ చేశాడు. ఆయన శ్రీరామ్‌ని నామినేట్‌ చేశారు. తమ మధ్య గ్యాప్ ఉందని చెబుతూ నామినేట్‌ చేశాడు. నువ్వు వెళ్లిపోతే తనకు ఫరాక్‌ పడదని ఆయన నామినేట్‌ చేశాడు. ఆ తర్వాత జెస్సీని.. సంచాలక్‌ నిర్ణయం సరైనది కాదు, కాస్త ఆలోచించి చేయాల్సింది అని నామినేట్‌ చేశాడు. సిరి..సన్నీని, ఆనీ మాస్టర్‌ని నామినేట్‌ చేసింది. కెప్టెన్సీ టాస్క్ లో వదిలేయోద్దంటూ వారించిన గివ్‌ అప్ చేశారని, దాన్ని ప్రెండ్స్ గా మేం చేశామని తమపై అరోపణలు చేయడం సరికాదని తెలిపింది. 

శ్రీరామ్‌.. సన్నీ, మానస్‌లను నామినేట్ చేశాడు. సన్నీ అగ్రెసివ్‌ లెవల్‌ విషయంలో నామినేట్‌చేశాడు. తనతో మానస్‌కి సమస్య ఏంటో అర్థం కావడం లేదు, తను ఐదారు మాస్క్ లు వేసుకుంటాడని తెలిపారు. అన్‌ప్రిడక్టబుల్‌ కాదని తెలిపారు. హౌజ్‌లో ఉన్నా తనకు సమస్య లేదన్నారు. రవి .. మానస్‌,కాజల్‌ను నామినేట్ చేశాడు. ఏదైనా ధైర్యంగా ముందు మాట్లాడాలని చెబుతూ మానస్‌ని, హ్యమర్ కొట్టడం తనకు నచ్చలేదని కాజల్‌ని నామినేట్‌ చేశారు. జెస్సీ.. సన్నీ, మానస్‌లను నామినేట్‌ చేశాడు. కెప్టెన్సీ టాస్క్ విషయంలో వీరిద్దరిని నామినేట్‌ చేశాడు. అయితే తర్వాత సన్నీ, జెస్సీల విషయంలో మరోసారి గొడవ జరిగింది. ఇది హాట్‌ టాపిక్‌ అయ్యింది. 

ప్రియాంక.. విశ్వ,రవిలను నామినేట్‌ చేసింది. విశ్వ తనకంటే బలమైన వాడని, తనకు పోటీగా వస్తాడని, రవి తనకైన తెలివైన వాడని, ఆయన్ని తాను రీచ్‌ కాలేనని నామినేట్‌ చేసింది. సన్నీ.. సిరి, జెస్సీలను నామినేట్‌ చేశాడు. ఫ్రెండ్ కోసం నువ్వు స్టాండ్‌ తీసుకోగా, నేను తీసుకుంటే తప్పేంటని కెప్టెన్సీ టాస్క్ విషయంలో సిరిని, సంచాలక్‌గా తాను తీసుకున్న నిర్ణయం సరైనది కాదని జెస్సీని నామినేట్‌ చేశాడు సన్నీ. విశ్వ.. ప్రియాంక, మానస్‌లను నామినేట్‌ చేశాడు. కండబలం, బుద్దిబలం ఉన్నాడని ప్రియాంక నామినేట్‌ చేయడం నచ్చలేదని తెలిపాడు. మానస్‌ మూడో వారంలో చేసిన ఓ పనిని గుర్తు చేస్తూ నచ్చలేదని తెలిపాడు. 

కాజల్‌.. రవి, శ్రీరామ్‌లను నామినేట్‌ చేసింది. తనని స్నేక్‌ అంటూ, తాను ఎదుగుదలను అడ్డుకున్నానో చెప్పాలంటూ రవిని నామినేట్‌ చేసింది. రవికి పిచ్చెక్కించింది. అయితే తామిద్దం కలవాలని చాలా ట్రై చేస్తున్నామని కానీ సెట్‌ కావడం లేదని తెలిపింది. అదే సమయంలో ఆనీ మాస్టర్ చెంచా అనడ నచ్చలేదని తెలిపింది. అనీ మాస్టర్‌.. సిరి, కాజల్‌లను నామినేట్‌ చేసింది. కెప్టెన్సీ టాస్క్ లో తనని ఎటాక్ చేశారని తెలిపింది. తనకు కాజల్‌ తీరు నచ్చడం లేదని నామినేట్‌ చేసింది. 

షణ్ముఖ్‌.. మానస్‌, ప్రియాంకలను నామినేట్‌ చేశాడు. సన్నీ కోపంగా ఉంటాడని, కానీ మానస్‌తో తనకు మంచి ర్యాపో ఉందని, తనని అర్థం చేసుకోవడం లేదని తెలిపారు. ప్రియాంకని నామినేట్‌ చేస్తూ తన గేమ్‌ తనే ఆడాలని తెలిపాడు. ఫోమ్‌ అంటించేందుకు వచ్చిన షణ్ముఖ్‌ రాగా, ప్రియాంక ముఖానికి గట్టిగా కొట్టుకుంది. అయితే ఇలా నామినేట్‌చేస్తూ ఇంటి పంపిస్తే తన గేమ్‌ తాను ఎలా ఆడాలని తెలిపింది. నామినేషన్ల తర్వాత హైలైట్‌ అయ్యేందుకు సిరి చేస్తుందని సన్నీ కామెంట్‌ చేయడం, ఆమె రియాక్ట్ అవడం హైలైట్‌గా నిలిచింది. 

ఇక ఈ వారం కెప్టెన్‌గా షణ్ముఖ్‌ సేవ్‌ అయ్యాడు. ఫైనల్‌గా సోమవారం నామినేషన్లలో షణ్ముఖ్‌ తప్ప అందరు నామినేట్‌ అయ్యారు. వారిలో మానస్‌, సన్నీ, శ్రీరామ్‌, సిరి, కాజల్‌, ప్రియాంక, రవి, జెస్సీ, అనీ మాస్టర్‌, విశ్వ తొమ్మిదో వారం నామినేట్‌ అయ్యారు. ఆదివారం జరిగిన దీపావళి ఈవెంట్‌లో లోబో ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. హౌజ్‌ నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది వెళ్లిపోగా, 11 మంది హౌజ్‌లో ఉన్నారు. 

also read: RRR glimpse: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, అజయ్‌ దేవగన్, అలియాలతో వర్క్ చేయడంపై రాజమౌళి హాట్‌ కామెంట్‌
 

Follow Us:
Download App:
  • android
  • ios