‘ఒక లైలా కోసం’తో తెలుగు సినీరంగ ప్రవేశం చేసిన పూజా హెగ్డే డీజే సినిమాలో అందాలతో అదరగొట్టింది. తన హెయిర్ స్టైల్ పై జోక్ వేసిన పూజా

‘ ఒక లైలా కోసం’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది పూజా హెగ్డే. తర్వాత వరుణ్ తేజ్ సరసన ముకుందా సినిమాలో మొరిసింది. ఈ రెండు సినిమాలు పర్వాలేదు అనిపించినా.. ఈ బ్యూటీకి మాత్రం పెద్దగా చాన్సులు రాలేదు. ఇక పూజ పని అయిపోయినట్టే అనుకునే లోపు డీజే సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. సినిమా విడుదలైన తర్వాత అందరూ పూజ గురించే మాట్లాడుకున్నారు. అంతలా అందాలు ఆరబోసింది మరి.

Scroll to load tweet…

ఇక అసలు విషయానికి వస్తే.. పూజ హెగ్డేకి ఒక డౌట్ వచ్చింది. వెంటనే ట్విట్టర్ వేదికగా అభిమానులను అడిగేసింది. ఇంతకీ ఏమిటా డౌట్ అంటే.. టెన్నిస్ క్రీడాకారుడు ఫెదరర్.. రెండు గంటలపాటు నిర్విరామంగా గేమ్ ఆడినా చెదరని జుట్టు.. తాను 20 నిమిషాల పాటు వర్క్ అవుట్స్ చేస్తేనే చెదిరిపోతుంది. ఎలా అంటూ అంటూ అడిగింది. అంతే కాదు.. ఫెదరర్ కప్పు చేత పట్టుకున్న ఫోటోని.. తాను వర్క్ అవుట్స్ చేసిన తర్వాత ఫోటోని జత చేసి.. రియల్ లైఫ్ ప్రాబ్లం అంటూ హ్యాష్ ట్యాగ్ చేసింది.

 దీంతో ఇప్పుడు ఆ ఫోటో కాస్తా వైరల్ అయ్యింది. మరి దీనికి సమాధానం ఫెదరర్ చెబుతాడో.. ఆయన అభిమానులే చెబుతారో వేచి చూడాలి. ప్రస్తుతం పూజ.. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటిస్తోంది.