రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన పీఎస్వీ గరుడవేగ మూవీ యుఎస్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ నాగార్జున రాజుగారిగది2, వున్నది ఒకటే జిందగీ సినిమాలకన్నా... ఎక్కువ కలెక్షన్స్ సాధించి యుఎస్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.

 

కేవలం ఆరు రోజుల్లో అమెరికాలో 341027 డాలర్లు వసూళ్లు సాధించి గరుడవేగ సత్తా చాటింది. ఓవర్సీస్ లో మంచి రెస్పాన్స్ వస్తుండటంతో రెండో వారం మరిన్ని స్క్రీన్స్ పెంచారు. గరుడవేగలో రాజశేఖర్ సరసన పూజా కుమార్, శ్రద్ధాదాస్ లు హిరోహిరోయిన్లుగా నటించగా కిషోర్ విలన్ రోల్ లో అద్దరగొట్టాడు.