బాహుబలి2 కన్నడను పట్టించుకోని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నేరుగా విడుదల చేసేందుకు సన్నాాహాలు చేస్తున్న నిర్మాతలు

దేశవ్యాప్తంగా యమా క్రేజ్ సంపాదించిన బాహుబలి2 చిత్రం ఏప్రిల్ 28న దేశవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే కన్నడ బాహుబలి 2 సినిమాకు సంబంధించి థియేటర్ హక్కులు ఇప్పటి దాకా ఎవరికీ ఇవ్వలేదు. మిగతా ఏరియాలన్నింటిలో హక్కులు అన్నీ ఏప్పుడో భారీ రేట్లకు ఇచ్చేసారు. కానీ కర్ణాటకలో మాత్రం బాహుబలి 2 గడ్డుకాలం ఎదుర్కొంటోంది. దీనికి పలు కారణాలున్నాయి,

ఒకటి కర్ణాటకలో టికట్ రేటు మీద సీలింగ్ కచ్చితంగా విధించడం. 200 రూపాయలకు మించి టికెట్ అమ్మడానికి వీలు లేదు అని క్లియర్ గా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ రేటుకు అమ్మితే బాహుబలి సినిమా హక్కులకు పెట్టే మొత్తం తిరిగి రికవరీ కావడం కష్టం. ఆ మాటకొస్తే ఆంధ్రలో కూడా అదే పరిస్థితి ఉన్నా... దొడ్డి దారిన దాదాపు అన్ని పెద్ద సినిమాలకు చాలా జిల్లాల్లో ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతున్నారు. బాహుబలికి అసలు సమస్య లేదు.

ఇక కర్ణాటకలో మరో సమస్య, కట్టప్పతో వచ్చి పడింది. కావేరీ జల వివాదానికి సంబంధించి కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ తమిళనాడుకు మద్దతు పలకడం కర్ణాటక జనాలకు నచ్చలేదు. బాహుబలి2 ప్రదర్శనను అడ్డుకుంటామని ఇప్పటికే ఉద్యమ సంఘాలు హెచ్చరించాయి. సత్యరాజ్ క్షమాపణ చెబితే ఓకె అంటున్నారు. అయితే సత్యరాజ్ క్షమాపణ లేదో తెలియదు. విడుదల రోజు కర్ణాటకలో సీన్ ఎలా వుంటుందో ఏమో. అందుకే ఎవరు కొన్నా లేనిపోని తలకాయనొప్పులు. అందుకే ప్రస్తుతానికి నిర్మాతలే నేరుగా విడుదల చేద్దామని భఆవిస్తున్నట్లు తెలుస్తోంది. మరి లాభాలు తెచ్చిపెట్టే కర్ణాటక మార్కెట్ లో బాహుబలి 2 ఎలా రిలీజవుతుందో.. నిర్మాతలకు ఎంత తెచ్చిపెడడుతుందో చూడాలి.