ప్రొడ్యూసర్ వాళ్ల ఆఫీస్ బాయ్ కి కథ చెప్పమని అన్నారు: ప్రశాంత్ వర్మ

Producer told the story to their watchmen Prasanth Varma
Highlights

  • కథ చెబుతుంటే నిద్రపోయేవారు
  • ఎవరికిపడితే వాళ్లకి కథ చెప్పమనేవారు   
  • ఓ రోజు రాత్రి వర్షంలో చాలా దూరం నడిచాను

వైవిధ్యభరితమైన కథా కథనాలతో 'అ!' సినిమా చేసిన ప్రశాంత్ వర్మ, తొలి ప్రయత్నంలోనే సక్సెస్ ను అందుకున్నాడు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ .. ఇండస్ట్రీలో తనకి ఎదురైన అవమానాలను గురించి ప్రస్తావించాడు. " నేను కథ చెబుతుండగా నిద్రపోయిన నిర్మాతలు వున్నారు" అన్నాడు.

"ఓ రోజు రాత్రి ఒక నిర్మాత కథ చెప్పమంటూ కార్లో తీసుకెళ్లాడు. వాళ్ల ఇల్లు చాలా లోపలికి వుంది. కథ విన్న తరువాత ... తెల్లవారు జామున 2 గంటలకు .. 'చేద్దాంలే .. నువ్వెళ్లమ్మా' అన్నారు. బయట విపరీతమైన వర్షం. ఆ వర్షంలో అలా చాలా దూరం నడుచుకుంటూ వచ్చేశాను. ఓ ప్రొడ్యూసర్ వాళ్ల వాచ్ మెన్ కి కథ చెప్పమన్నాడు .. మరో ప్రొడ్యూసర్ వాళ్ల ఆఫీస్ బాయ్ కి కథ చెప్పమన్నాడు. 'వాళ్లకి కూడా నచ్చాలమ్మా .. మాస్ పల్స్ తెలియాలి గదా' అనేవారు. ఇలా చాలా అవమానాలను ఎదుర్కొన్నాను' అంటూ చెప్పుకొచ్చాడు

loader