సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు (రాధాకృష్ణ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు (రాధాకృష్ణ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ధమ్ మసాలా సాంగ్ ఆకట్టుకుంది. 

అయితే సెకండ్ సింగిల్ నేడు రిలీజ్ కాబోతోంది. ఈ సాంగ్ అప్డేట్ కోసం రిలీజ్ చేసిన చేసిన పోస్టర్ చూస్తే శ్రీలీల, మహేష్ బాబు మధ్య రొమాన్స్, కెమిస్ట్రీ అదిరిపోనున్నట్లు తెలుస్తోంది. శ్రీలీల.. మహేష్ కి ముద్దు ఇస్తున్న పోస్టర్ వైరల్ గా మారింది. ఆలాగే సాంగ్ ప్రోమోలో కూడా మహేష్, శ్రీలీల మధ్య సంభాషణ చాలా క్యూట్ గా ఉంది. 

అమ్ము.. రవణగాడు.. గుర్తెట్టుకో గుంటూరు వచ్చినప్పుడు పనికొస్తుంది అంటూ మహేష్ చెప్పడం.. శ్రీలీల క్యూట్ గా స్పందించడం ఆకట్టుకుంటోంది. అయితే మహేష్ బాబు.. శ్రీలీలతో రొమాన్స్ చేయడాన్ని కొందరు ట్రోల్ చేస్తున్నారు. మహేష్ బాబు.. శ్రీలీల మధ్య వయసు వ్యత్యాసాన్ని గుర్తు చేస్తున్నారు. మహేష్ బాబు వయసు ప్రస్తుతం 48 ఏళ్ళు. శ్రీలీల వయసు 22 ఏళ్ళు. 

Scroll to load tweet…

ఇదే విషయాన్నీ ప్రస్తావిస్తూ ఓ మహిళా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ పోస్ట్ చేసింది. మహేష్ బాబు కూతురికంటే శ్రీలీల కాస్త పెద్దది. అండర్ ఏజ్డ్ అమ్మాయిలతో రొమాన్స్ చేయడం సూపర్ స్టార్ ఇకనైనా మానుకుంటే మంచిది అని పోస్ట్ చేసింది. దీనికి బేబీ నిర్మాత ఎస్ కె ఎన్ స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'హలో మేడమ్.. ఇండియాలో 22 ఏళ్ల వయసుని అండర్ ఏజ్ అంటారా ? ఎలాగో కాస్త చెప్పండి.. అంటూ కౌంటర్ ఇచ్చారు. ఎస్ కె ఎన్ రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Also Read: 2023లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఇచ్చిన క్రేజీ డైరెక్టర్లు.. ప్రభాస్, చిరుతో సహా వీళ్లంతా జీవితంలో మరచిపోలేరు