ప్రముఖ తమిళ నిర్మాత ముక్తా శ్రీనివాసన్(90) మంగళవారం రాత్రి పది గంటల సమయంలో ఆయన స్వగృహంలోనే కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ మంగళవారం చెన్నైలో మృతి చెందారు.

బాలచందర్, మణిరత్నం వంటి స్టార్ డైరెక్టర్లు గురువుగా భావించే ఆయన మరణించడంతో తమిళ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి చెందింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ముక్తా ఫిలిమ్స్ పేరుతో 60కి పైగా సినిమాలను నిర్మించారు. కమల్ హాసన్ వంటి హీరోలకు బ్రేక్ ఇచ్చిన నిర్మాత శ్రీనివాసన్. ఆయన మృతి పట్ల నటులు రజినీకాంత్, కమల్ హాసన్, మణిరత్నం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 70 ఏళ్ల ఆయన సినీ జీవితంలో ఎందరికో ఉపాధిని కల్పించి మరెందరికో జీవితాలు అందించిన మహనీయుడు ముక్తా శ్రీనివాసన్.