రాజ్ తరుణ్ సినిమాకు అంత అవసరమా..? దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

Producer Dil Raju Shocking Comments On Hero Raj Tarun
Highlights

చాలా రోజులుగా రాజ్ తరుణ్ మా బ్యానర్ లో సినిమా చేస్తానని అడుగుతున్నాడు. ఈ కథ అతడికి సరిపోతుందని అతడితో చేశాం. మా బ్యానర్ లో ఇంత తక్కువ బడ్జెట్ లో ఎప్పుడూ సినిమా చేయలేదు

ఏ నిర్మాత తన హీరోని తక్కువ చేసి మాట్లాడడు. అందులోను మీడియా ముఖంగా అసలు ఎలాంటి కామెంట్స్ చేయరు. వారికి వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉంటే అవి  వాళ్లే పెర్సనల్ గా చూసుకుంటారు. కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం హీరో రాజ్ తరుణ్ ను తక్కువ చేసి మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన తెలిసి చేశాడో, తెలియక చేశాడో కానీ తన హీరోపై ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అసలు విషయంలోకి వస్తే రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు 'లవర్' అనే సినిమాను తన బ్యానర్ పై నిర్మించాడు. అనీష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దిల్ రాజు మీడియాతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ.. ''రాజ్ తరుణ్ అప్ కమింగ్ హీరో.. అతడు నటించిన సినిమాలు కూడా ఈ మధ్య కాలంలో పెద్దగా వర్కవుట్ కాలేదు. అలాంటిది అతడిపై నేను ఎనిమిది కోట్లు పెట్టాను. ఈ సినిమా రిజల్ట్ విషయంలో నేను చాలా టెన్షన్ గా ఉన్నాను. ఎప్పుడూ ఇంత టెన్షన్ ఏ సినిమాకు పడలేదు.

హీరోని కాదు మా బ్యానర్ ను దృష్టిలో పెట్టుకొని సినిమా చేశాం. చాలా రోజులుగా రాజ్ తరుణ్ మా బ్యానర్ లో సినిమా చేస్తానని అడుగుతున్నాడు. ఈ కథ అతడికి సరిపోతుందని అతడితో చేశాం. మా బ్యానర్ లో ఇంత తక్కువ బడ్జెట్ లో ఎప్పుడూ సినిమా చేయలేదు. రాజ్ తరుణ్ మార్కెట్ తో పోలిస్తే ఈ బడ్జెట్ చాలా ఎక్కువ. అతడి నాలుగైదు కోట్లు పెట్టడమే చాలా ఎక్కువ అలాంటిది నేను డబుల్ పెట్టాను. ఇక అలాంటిది హీరోలను హీరోయిన్లు దొరకడం ఎంత కష్టమో తెలిసిందే. పెద్ద హీరోయిన్లు ఎవరూ రాజ్ తరుణ్ పక్కన చేయరు. హర్షిత్(దిల్ రాజు తమ్ముడు కొడుకు) వచ్చి సినిమాలో ఒక్కో పాటకు ఒక్కో సంగీత దర్శకుడ్ని పెడతా అన్నాడు. రాజ్ తరుణ్ సినిమాకు అంత అవసరమా అని అడిగాను'' అంటూ రాజ్ తరుణ్ కు ఇవ్వాల్సిన కనీసపు గౌరవం ఇవ్వకుండా మాట్లాడారు.     
 

loader