ఈ ఉంగరాలకి అర్థం ఏంటీ..? ప్రియాంక ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా..?

priyanka chopra nick jonas are engaged
Highlights

బాలీవుడ్  నటి ప్రియాంకా చోప్రా, ఆమె బాయ్ ఫ్రెండ్ నిక్ జోనాస్‌కి సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ అయిపోయిందన్న వార్తలతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. ఇద్దరూ ఒకే మోడల్‌కు చెందిన రింగ్స్  ధరించడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.

నలుగురికి చెప్పకుండా చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. ఏమైనా అడిగితే అబ్బే అతను నా ఫ్రెండ్ అని చెప్పడం.. ఆ తర్వాత సైలెంట్‌గా పెళ్లి చేసుకోవడం బాలీవుడ్ హీరోయిన్లకు కామన్ అయిపోయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ లిస్ట్‌లో చాలామంది భామలు ఉన్నారు. ఈ లిస్ట్‌లోకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా కూడా చేరేలా ఉంది. హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రియ అక్కడ కూడా మంచి మార్కులే కొట్టేసింది.

అదే సమయంలో అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌తో ప్రేమలో పడిందనే వార్తలు గుప్పుమన్నాయి. ఇద్దరూ పలుమార్లు లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళడంతో పాటు పబ్‌లలో జంటగా కనిపించడంతో అది నిజమే అనుకున్నారు అభిమానులు. తాజాగా మరో న్యూస్ ఒకటి ఈ జంట గురించి చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం ఇండియాలోనే ఉన్న ఈ జంట సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకటి రెండు సార్లు బయట కనిపించిన వీరిద్దరి చేతి వేళ్లకి ఒకే మోడల్ రింగ్ కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. ఇకపోతే ప్రియుడి కోసం ముంబై బీచ్ ఏరియాలో ప్రియాంక రూ.100 కోట్లు వెచ్చింది విలాసవంతమైన భవనాన్ని నిర్మిస్తోందని బాలీవుడ్ కోడై కూస్తోంది. మీడియాలో ఇంతటి ప్రచారం జరుగుతున్నా ఇద్దరు ఇంతవరకు నోరు విప్పలేదు.

loader