ప్రియాంకచోప్రాపై అధికారుల ఫైర్!

Priyanka Chopra gets notice for illegal construction
Highlights

బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రా హాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ నటిగా దూసుకుపోతుంది

బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రా హాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ నటిగా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో సల్మాన్ తో కలిసి ఓ సినిమాలో నటించనునుంది. ఈ మధ్యకాలంలో తన బాయ్ ఫ్రెండ్ నిక్ జోనాస్ తో ఎక్కువగా సమయం గడుపుతుందని వార్తల్లో నిలిచిన ప్రియాంక తాజాగా మరో విషయంతో మీడియాలో హాట్ టాపిక్ అయింది.

ముంబైలో దక్షిణ అంధేరీ ప్రాంతంలో ప్రియాంకకు ఒషివారా అనే కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు మున్సిపల్ అధికారులు  గుర్తించారు. ఈ కాంప్లెక్స్ కోసం ఐదేళ్ల క్రితం అధికారులు ఓ ప్లాన్ కు అంగీకారం తెలపగా, వాస్తు కోసం అక్రమంగా కొన్ని నిర్మాణాలు చేసినట్లు తాజాగా తనిఖీల్లో వెల్లడైంది. ఆ కాంప్లెక్స్ లో ఒక స్పాకు వచ్చే వారు అధికారులకు ఫిర్యాదు చేయగా.. అధికారులు తనిఖీలు చేపట్టారు.

ప్లాన్ ప్రకారం కాకుండా.. నిర్మాణాలు చేపట్టినట్లు తేలింది. ఈ విషయంపై అధికారులు ప్రియాంకకు నోటీసులు పంపించారు. ఒకవేళ ఆమె గనుక నోటీసులకు రెస్పాండ్ కాకపోతే.. తామే స్వయంగా వాటిని కూల్చివేస్తామని నోటీసుల్లో హెచ్చరించారు. 
 

loader