ప్రియుడితో కలిసి రహస్యంగా ముంబై చేరుకున్న ప్రియాంకా చోప్రా..

First Published 23, Jun 2018, 12:32 PM IST
Priyanka chopra caught with boy friend in bombay
Highlights

ప్రియుడితో కలిసి రహస్యంగా ముంబై చేరుకున్న ప్రియాంకా చోప్రా.. 

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తనకన్నా వయసులో చాలా చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ తో ప్రేమలో పడినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలసి అమెరికాలో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న పలు ఫొటోలు మీడియాలో దర్శనం ఇచ్చాయి.

తాజాగా వీరిద్దరూ కలసి సీక్రెట్ గా ముంబై చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. ఎవరి కంటా పడకుండా విమానాశ్రయం నుంచి బయటకు వచ్చినప్పటికీ... చివరకు కారులో వెళుతుండగా కెమెరా కంటికి చిక్కారు. ఎయిర్ పోర్ట్ నుంచి నిక్ తో కలసి జుహులోని తన ఇంటికి చేరుకుంది క్వాంటికో భామ. ప్రియాంక తల్లిని కలిసేందుకే ముంబైకి నిక్ వచ్చినట్టు సమాచారం. అంతేకాదు, ప్రియాంక కుటుంబం ఇచ్చే పార్టీకి కూడా హాజరుకానున్నాడు. మరోవైపు, అమెరికాలో నిక్ కుటుంబసభ్యులను కొన్ని రోజుల క్రితం ప్రియాంక కలిసింది.  

loader